POST OFFICE SAVINGS SCHEME INVEST IN THESE SCHEMES TO GET BETTER RETURN THAN FD MK GH
Postal Deposits: ఎఫ్డీలను మించిన రిటర్న్ కావాలా? ఈ పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టండి
(ప్రతీకాత్మక చిత్రం)
ఫిక్స్డ్ డిపాజిట్ల(FD) కంటే మెరుగైన రాబడిని పొందాలనుకుంటున్నారా? మీ ఆదాయంలో కొంత పొదుపు చేయడంతో పాటు.. సురక్షిత పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే విభిన్నమైన పొదుపు పథకాలను అందించే పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్ల(FD) కంటే మెరుగైన రాబడిని పొందాలనుకుంటున్నారా? మీ ఆదాయంలో కొంత పొదుపు చేయడంతో పాటు.. సురక్షిత పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే విభిన్నమైన పొదుపు పథకాలను అందించే పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో మీరు ఎంచుకునే పథకాన్ని బట్టి 5.5 శాతం నుంచి 7.6 శాతం మధ్య వడ్డీ రేట్లు ఉంటాయి. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు 10 సంవత్సరాల కాలానికి 5-6 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అయితే చిన్నమొత్తాల పొదుపు పథకాలు ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీరేటును అందిస్తాయి. అదీగాక ఎఫ్డీలు.. పోస్టాఫీసు పొదుపు పథకాల్లాగా వడ్డీ రేటు, పన్ను ప్రయోజనాలు ఎక్కువగా అందించలేవు. అంతేగాక పోస్టాఫీసు పథకాలు ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మరి అలాంటి పొదుపు పథకాలేంటో తెలుసుకోండి..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):
15 సంవత్సరాల వ్యవధికి గాను పోస్టాఫీస్ అందించే ఉత్తమమైన పాలసీ పీపీఎఫ్ ఖాతా. 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఆదాయపు పన్ను ప్రయోజనాలూ అందుతాయి. దీనిపై వచ్చే రిటర్న్‌పై పన్ను ఉండదు. మైనర్ పేరుతోనూ ఖాతా తెరవచ్చు సంవత్సరానికి రూ. 500 నుంచి 1.5 లక్షల రూపాయల వరకు PPF ఖాతాలో జమ చేయవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన:
ఆడపిల్లల కోసం కొంత నిధిని కేటాయించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన అద్భుత పథకంగా దీనిని చెప్పవచ్చు. సుకన్య సమృద్ధి యోజన(SSY) 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఆడపిల్లల పేరుపై ఖాతా తెరవొచ్చు. దీని కాలవ్యవధి 21 సంవత్సరాలు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్:
రిటైర్మెంట్ అనంతరం వయోవృద్ధుల కోసం ఆదాయాన్నిచ్చే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS). ఈ పథకం కింద 7.4 శాతం వడ్డీని పొందొచ్చు. 5 సంవత్సరాలకు మెచ్యూరిటీ అవుతుంది. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ. 15 లక్షల వరకు, రిటర్న్‌పై వచ్చే వడ్డీపై పన్ను ఉండదు. కొన్ని మినహాయింపులతో 60 ఏళ్లు పైబడిన భారతీయులందరూ దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్(NSC):
ఐదేళ్ల స్వల్ప కాల పెట్టుబడి కోసం ఉద్దేశించినది. పన్ను ప్రయోజనాలను పొందాలనుకునే వారికి అనుకూలమైన పథకం. సాధారణంగా ఐదేళ్ల బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేటు 5.5 శాతం కాగా.. ఎన్ఎస్సీలో 6.8 శాతం రాబడి వస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.