హోమ్ /వార్తలు /బిజినెస్ /

Post Office కొత్త రూల్స్.. ఇకపై డబ్బులు విత్‌డ్రా చేయాలంటే..

Post Office కొత్త రూల్స్.. ఇకపై డబ్బులు విత్‌డ్రా చేయాలంటే..

పోస్ట్ ఆఫీస్‌ కొత్త రూల్స్

పోస్ట్ ఆఫీస్‌ కొత్త రూల్స్

Post Office New Rules | మీరు పోస్టాఫీస్ కస్టమరా? మీకు పోస్టాఫీస్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Small Saving Schemes| పోస్టాఫీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రామీణ ప్రాంతాలు సహా పట్టణ ప్రాంతాల్లోని చాలా మంది పోస్టాఫీస్‌లో (Post Office) డబ్బులు దాచుకుంటూ ఉంటారు. పోస్టాఫీస్ ఇన్వెస్ట్‌మెంట్లు (Investment) చాలా సురక్షితమని ప్రజలు భావిస్తుంటారు. అందుకే పోస్టాఫీసుల్లో డబ్బులు (Money) దాచుకునే వారు చాలా మంది ఉంటారు. అంటే వీరందరికీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. పోస్టాఫీస్‌లో అకౌంట్ కలిగిన వారు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి.

  డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇటీవలనే కొత్త రూల్ తీసుకువచ్చింది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే.. అప్పుడు కచ్చితంగా ఐడెంటిటీని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరకపోవచ్చు.

  బంగారు ఆభరణాలపై ఈ చార్జీలు పెరిగాయి! కొత్త రేట్లు ఇలా

  పోస్టాఫీస్‌ అకౌంట్ నుంచి రూ.10000 లేదా ఆపైన విలువ కలిగిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. ముందుగా ఐడెంటిటీని ధ్రువీకరించుకోవాలి. తర్వాతనే సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోగలరు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కూడా ఇటీవల ఒక సర్క్యూలర్ జారీ చేసింది. దీని ప్రకారం పోస్టాఫీస్ బ్రాంచుల్లో రూ. 10 వేలు లేదా ఆపైన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే వెరిఫికేషన్ అనేది ఉంటుంది.

  బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా పడిపోయిన ధరలు!

  పోస్టాఫీస్‌లోని సర్కిల్ హెడ్ ఈ పనులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కచ్చితంగా కస్టమర్ల ఐడెంటిటీని ధ్రువీకరించుకోవాలి. తర్వాతనే వారికి డబ్బులు విత్‌డ్రా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టాఫీస్‌లో మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కొత్త రూల్‌ను తీసుకువచ్చారు. విత్‌డ్రా మోసాలు జరగకుండా చూడాటానికి ఈ కొత్త నిబంధనను అమలు చేస్తున్నారు. అందువల్ల పోస్టాఫీస్‌లో అధిక మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేటప్పుడు వెంటనే పోస్టాఫీస్ పాస్ బుక్‌తో పాటుగా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వంటి వాటిని కూడా తీసుకెళ్లడం ఉత్తమం.

  ఇకపోతే దేశంలోని పౌరులు ఎవరైనా సరే పోస్టాఫీస్‌కు వెళ్లి రూ. 500 కనీస మొత్తంతో సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్లపై 4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లపై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. ఈ వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ వస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 3500 వరకు వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ. 7000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: India post, Personal Finance, Post office, Post office scheme

  ఉత్తమ కథలు