news18-telugu
Updated: November 29, 2020, 6:27 AM IST
ప్రతీకాత్మక చిత్రం
Post Office RD Scheme: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే భారత దేశం కోలుకుంటోంది. దాంతో బ్యాంకులు రకరకాల స్కీములను కస్టమర్లను ఆకర్షించేందుకు తెస్తున్నాయి. ఫైనాన్షియల్ సంస్థలు కూడా అదే రూట్ ఫాలో అవుతున్నాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే... ఎలాంటి హడావుడీ చేయని పోస్ట్ ఆఫీస్ మాత్రం అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తెచ్చింది. ఎవరైనా సరే రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే... ఇది సరైన స్కీమ్. అఫ్కోర్స్ కొన్ని బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ కంటే బెటర్ వడ్డీ రేటు ఇస్తామనవచ్చు. ఐతే... ఈ స్కీమ్ ఎంతో అనుకూలంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కావాల్సినప్పుడు మార్పులు చేసుకునే వీలు ఇందులో ఉంది. ఇప్పుడు మనం ఐదేళ్ల కాల పరిమితితో ఉన్న పోస్ట్ ఆపీస్ రికరింగ్ డిపాజిట్ (RD)లను తెలుసుకుందాం.
ఎవరు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు:రిస్క్ లేకుండా... పెట్టిన పెట్టుబడికి కచ్చితంగా రిటర్న్ రావాలనుకునేవారు ఈ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. వ్యక్తులు, ముగ్గురు కలిసి తీసుకునే జాయింట్ అకౌంట్, మైనర్ తరపున సంరక్షకులు, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తరపు సంరక్షకులు, 10 ఏళ్లు దాటిన మైనర్లు స్వయంగా ఎన్ని అకౌంట్లైనా తెరవవచ్చు.
కనీసం ఎంత ఇన్వెస్ట్ చెయ్యాలి:
పోస్ట్ ఆఫీసులో RD తెరవాలంటే కనీసం నెలకు రూ.100 ఇన్వెస్ట్ చెయ్యాలి. మాగ్జిమం ఎంతైనా పెట్టవచ్చు. నగదు లేదా చెక్ రూపంలో ఇవ్వొచ్చు.
పోస్ట్ ఆఫీస్ RD స్కీములో వడ్డీ ఎంత:
ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేటు ఏడాదికి 5.8 శాతంగా నిర్ణయించారు. RD స్కీముపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని కాంపౌండ్ చేస్తారు.
టైముకి డిపాజిట్ చెయ్యకపోతే:
నెల నెలా టైముకి అమౌంట్ డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది. అలాచెయ్యకపోతే... స్కీమ్ అమౌంట్లో 1 శాతాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 4 సార్లు లేటుగా చెల్లిస్తే... అకౌంట్ క్లోజ్ చేస్తారు. ఐతే... 2 నెలల తర్వాత మళ్లీ అకౌంట్ కొనసాగించేందుకు వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అకౌంట్ తిరిగి తెరచుకోకపోతే... ఇక పర్మనెంట్‌గా క్లోజ్ చేస్తారు.
ముందే క్లోజ్ చేసుకోవాలంటే:
స్కీమ్ ప్రారంభమైన 3 ఏళ్ల తర్వాత నుంచి స్కీమును ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. 3 ఏళ్ల లోపే క్లోజ్ చేసుకుంటే... సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు దీనికి వర్తిస్తుంది.
మెచ్యూరిటీ ఎప్పటికి అవుతుంది:
5 ఏళ్లలో లేదా 60 నెలల్లో అకౌంట్ మెచ్యూర్ అవుతుంది.
మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది:
మీరు నెలకు రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే... 10 ఏళ్ల తర్వాత రూ.16 లక్షలు పొందగలరు.
ఒకవేళ మీరు నెలకు రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ... 5 ఏళ్ల తర్వాత కావాలంటే రూ.7 లక్షలు పొందగలరు.
ఒకవేళ మీరు నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ... 10 ఏళ్ల తర్వాత కావాలంటే రూ.8 లక్షలకు పైగా పొందగలరు.
ఇది కూడా చదవండి: Gold Silver Prices Today: బంగారం ధరలు భారీ పతనం... ఇన్వెస్టర్లకు టెన్షన్
లోన్ తీసుకునే సదుపాయం:
RD అకౌంట్ తీసుకునేవారు ఏడాదికి 12 ఇన్స్టాల్మెంట్లు చెల్లించాక... తమ బ్యాలెన్స్ లోంచీ 50 శాతం వరకూ లోన్ తీసుకోవచ్చు. దాన్ని తిరిగి ఒకేసారి చెల్లించవచ్చు. లేదా నెలవారీ చెల్లించవచ్చు. లోన్ పై వడ్డీ రేటు 7.8 శాతం ఉంటుంది. టైముకి లోన్ ఇన్స్టాల్మెంట్ చెల్లించకపోతే... లోన్ అమౌంట్, వడ్డీ రేటును... RD అమౌంట్ నుంచి తగ్గిస్తారు.
Published by:
Krishna Kumar N
First published:
November 29, 2020, 6:27 AM IST