హోమ్ /వార్తలు /బిజినెస్ /

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16.26 లక్షల రిటర్న్స్

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16.26 లక్షల రిటర్న్స్

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16.26 లక్షల రిటర్న్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16.26 లక్షల రిటర్న్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Scheme | పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఓ పొదుపు పథకంలో (Savings Scheme) డబ్బులు పొదుపు చేయడం ద్వారా రూ.16.26 లక్షల రిటర్న్స్ పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్‌లోని పాపులర్ పథకాల్లో ఇది కూడా ఒకటి.

ఇండియా పోస్ట్ దేశంలోని పోస్ట్ ఆఫీసుల ద్వారా పౌరులకు అనేక పొదుపు పథకాలను (Savings Schemes) అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న పొదుపు పథకాల్లో కొన్ని పాపులర్ అయ్యాయి. పోస్ట్ ఆఫీసుల్లో పొదుపు పథకాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (Fixed Deposits), రికరింగ్ డిపాజిట్స్ కూడా ఉంటాయి. కానీ పొదుపు పథకాల్లో ఎక్కువకాలం డబ్బు పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే 20 నుంచి 30 ఏళ్ల పాటు పొదుపు చేసేవారు మంచి రిటర్న్స్ పొందొచ్చు. అయితే అంతవరకు పొదుపు చేయకుండా ఓ పదేళ్లపాటు డబ్బులు పొదుపు చేయాలనుకునేవారికి రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (Recurring Deposit Account) ఉపయోగపడుతుంది.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను 10 ఏళ్లు దాటినవారు ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఇందులో కనీసం నెలకు రూ.100 పొదుపు చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ అకౌంట్ వడ్డీ రేట్లు చూస్తే ప్రస్తుతం 5.8 వార్షిక వడ్డీ లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను పెంచుతుండటంతో బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో పొదుపు పథకాల వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

Money Tips: ఖాతాదారులకు అలర్ట్... బ్యాంకులో అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్‌ని క్లెయిమ్ చేయండి ఇలా

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. మూడేళ్ల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది తర్వాత 50 శాతం లోన్ తీసుకోవచ్చు. ఒకవేళ మెచ్యూరిటీ కన్నా ఒకరోజు ముందు అకౌంట్ క్లోజ్ చేసినా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ఆర్‌డీ అకౌంట్ వడ్డీ కన్నా సేవింగ్స్ అకౌంట్ వడ్డీ తక్కువ. ఐదేళ్ల తర్వాత కూడా పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ అకౌంట్ కొనసాగించవచ్చు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో నెలకు రూ.10,000 చొప్పున 10 ఏళ్లు పొదుపు చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు 5.8 శాతం ప్రకారం రూ.16.26 లక్షల రిటర్న్స్ వస్తాయి. 10 ఏళ్లలో డిపాజిట్ చేసే మొత్తం రూ.12 లక్షలు అయితే వడ్డీ రూ.4.26 లక్షలు వస్తుంది. ప్రతీ మూడు నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తారు కాబట్టి రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి.

Documents For Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లండి

పోస్ట్ ఆఫీసులో నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర లాంటి పొదుపు పథకాలు ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ పొదుపు పథకాలను ఎంచుకోవచ్చు.

First published:

Tags: India post, Personal Finance, Post office, Post office scheme

ఉత్తమ కథలు