కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పలు రకాల పొదుపు పథకాలను (Saving Schemes) రూపొందించింది. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు (Small Saving Schemes) ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉంటుంది. కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget 2023) లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (Post Office Monthly Income Scheme) లిమిట్‌ను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో రూ.4,50,000 మాత్రమే పొదుపు చేయొచ్చు. ఈ లిమిట్‌ను రెట్టింపు చేసి రూ.9,00,000 చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రస్తుతం జాయింట్ అకౌంట్‌కు రూ.9,00,000 పొదుపు చేయొచ్చు. ఈ లిమిట్‌ను రూ.15,00,000 చేసింది ప్రభుత్వం. పెరిగిన లిమిట్ 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బెనిఫిట్స్ చూస్తే 2023 జనవరి నుంచి మార్చి మధ్య ఈ పథకానికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతీ మూడు నెలలకు ఓసారి కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఈ పథకాల వడ్డీరేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. పెరిగిన లిమిట్ ప్రకారం రూ.9,00,000 పొదుపు చేస్తే ప్రతీ నెలా రూ.5,325 వడ్డీ లభిస్తుంది. జాయింట్ అకౌంట్‌లో రూ.15,00,000 పొదుపు చేస్తే ప్రతీ నెలా రూ.8,875 వడ్డీ లభిస్తుంది.
Money Rules: మీ డబ్బుపై ప్రభావం చూపే 7 మార్పులు ఇవే... ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్‌ను ఐదేళ్ల పాటు కొనసాగించవచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో కనీసం రూ.1000 పొదుపు చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ను ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ అయితే ముగ్గురు కలిపి ఓపెన్ చేయొచ్చు. మైనర్ ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే గార్డియన్ తప్పనిసరి. 10 ఏళ్లు దాటిన మైనర్ తమ పేరు మీద పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఓపెన్ చేయడానికి మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీసుకు వెళ్లాలి. దరఖాస్తు ఫామ్, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేసి ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
Money Schemes: ఈ పాపులర్ స్కీమ్స్‌లో చేరడానికి రేపే చివరి తేదీ
అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతీ నెలా వడ్డీ పొందొచ్చు. మెచ్యూరిటీ వరకు ప్రతీ నెలా వడ్డీ లభిస్తుంది. ఆటో క్రెడిట్ ద్వారా వడ్డీ ప్రతీ నెలా జమ అవుతుంది. ప్రతీ నెలా పొందే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత జమ చేసిన మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.9,00,000, జాయింట్‌గా రూ.15,00,000 జమ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ జమ చేస్తే, లిమిట్ కన్నా ఎంత ఎక్కువ ఉన్న మొత్తాన్ని రీఫండ్ చేస్తుంది పోస్ట్ ఆఫీస్. అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాదిలోపు డబ్బులు విత్‌డ్రా చేసే అవకాశం ఉండదు. 1 నుంచి 3 ఏళ్ల లోపు విత్‌డ్రా చేస్తే అసలుపై 2 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు అకౌంట్ క్లోజ్ చేస్తే జమ చేసిన మొత్తంపై 1 శాతం ఛార్జీ చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.