Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు తెలుసుకోండి

Post Office Franchise Scheme | ఈ ఫ్రాంఛైజ్ ద్వారా స్టాంప్స్, స్టేషనరీ అమ్మకాలు, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ సేవల్ని అందించొచ్చు. కమీషన్ రూపంలో మీకు ఆదాయం లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 18, 2019, 1:10 PM IST
Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు తెలుసుకోండి
Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు తెలుసుకోండి
news18-telugu
Updated: April 18, 2019, 1:10 PM IST
కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? పెట్టుబడికి ఎక్కువగా డబ్బులు లేవా? అయితే కేవలం రూ.5000 డిపాజిట్‌తో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు. దేశంలో 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అయితే ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకే ఇండియా పోస్ట్ పలు చోట్ల ఫ్రాంఛైజీలను ఆఫర్ చేస్తోంది. మీరు కూడా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవాలంటే కేవలం రూ.5000 సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే చాలు. ఈ ఫ్రాంఛైజ్ ద్వారా స్టాంప్స్, స్టేషనరీ అమ్మకాలు, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ సేవల్ని అందించొచ్చు. కమీషన్ రూపంలో మీకు ఆదాయం లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Post Office Franchise: పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఎవరెవరు తీసుకోవచ్చు?


ఎవరైనా వ్యక్తిగతంగా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా సంస్థ, ఎన్జీఓ నిర్వహిస్తున్నా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌ కోసం దరఖస్తు చేయొచ్చు. కిరాణా షాపులు, పాన్ షాపులు, స్టేషనరీ దుకాణాలు, చిరు వ్యాపారులు కూడా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ కోసం అప్లై చేయొచ్చు. కొత్తగా ఏర్పాటైన అర్బన్ టౌన్‌షిప్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్స్, ఇండస్ట్రియల్ సెంటర్స్, కాలేజీలు, పాలిటెక్నిక్స్, యూనివర్సిటీస్, ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఏర్పాటు చేయొచ్చు. ఇందుకోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ డిపార్ట్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ మెయింటైన్ చేయడానికి కనీస విద్యార్హత 8వ తరగతి. వయస్సు 18 ఏళ్లు దాటాలి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు.

Read this: Indian Railways: భారతీయ రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

post office franchise, post office franchise for csc, post office franchise application form pdf, post office franchise in telugu, post office agent recruitment, india post franchise online apply, post office franchise business, business ideas, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తెలుగు, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ దరఖాస్తు, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఏజెంట్, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఆన్‌లైన్, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ బిజినెస్, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ వ్యాపారం, బిజినెస్ ఐడియా


Post Office Franchise: పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఎలా ఇస్తారు?


దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇండియా పోస్ట్ అధికారులు పరిశీలిస్తారు. మీ దరఖాస్తు డివిజనల్ హెడ్‌కు వెళ్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకున్న 14 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరన్న విషయం గుర్తుంచుకోవాలి. మీకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వాలని అధికారులు నిర్ణయిస్తే మినిమమ్ సెక్యూరిటీ డిపాజిట్ రూ.5,000 చెల్లించాలి. అయితే ఒక రోజులో నిర్వహించే ఆర్థిక లావాదేవీలను బట్టి సెక్యూరిటీ డిపాజిట్ మారొచ్చు.
Loading...

Post Office Franchise: పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌లో ఏఏ సేవలు లభిస్తాయి?


పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌లో స్టాంపులు, స్టేషనరీ అమ్మొచ్చు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, మనీ ఆర్డర్ లాంటి సేవలు అందించొచ్చు. రూ.100 కన్నా తక్కువగా మనీ ఆర్డర్ అనుమతించరు. పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్(PLI) బుక్ చేయొచ్చు. ప్రీమియం వసూలు చేయొచ్చు. దీంతో పాటు బిల్లులు, పన్నులు వసూలు చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్‌కు సంబంధించిన సేవల్ని పౌరులకు అందించొచ్చు. వీటిపై పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌ నిర్వాహకులకు కమిషన్ లభిస్తుంది. రిజిస్టర్డ్ పోస్ట్‌కు రూ.3, స్పీడ్‌పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్‌పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్‌పై రూ.5 కమీషన్ వస్తుంది. నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్‌లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది. ఇక స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ ఫామ్ లాంటి అమ్మకాలపై 5 శాతం కమిషన్ ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి:

Video: దాతల నుంచి వీర్యం సేకరించడానికి మెషీన్ తయారు చేసిన చైనా కంపెనీ

Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు

SBI Quick Transfer: క్షణాల్లో ఎవరికైనా రూ.10,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626