హోమ్ /వార్తలు /బిజినెస్ /

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో ఈ స్కీమ్‌తో నెలనెలా ఆదాయం

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో ఈ స్కీమ్‌తో నెలనెలా ఆదాయం

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో ఈ స్కీమ్‌తో నెలనెలా ఆదాయం
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో ఈ స్కీమ్‌తో నెలనెలా ఆదాయం (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Monthly Income Scheme | పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా ప్రతీ నెలా ఆదాయం పొందొచ్చు. మీకు దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీసులో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.

ప్రస్తుతం ఎక్కువ శాతం భారత యువత రిస్క్ లేని లేదా రిస్క్ తక్కువగా ఉండే పెట్టుబడుల్లో నిధులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఎలాంటి రిస్క్‌ లేని పెట్టుబడులకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి ఇండియా పోస్ట్ అందించే పెట్టుబడి ఆప్షన్లు. ఇవి మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన పథకాలుగా గుర్తింపు పొందాయి. ఇతర మార్గాలతో పోలిస్తే తక్కువ రాబడి అందుతున్నప్పటికీ.. ప్రభుత్వ మద్దతు, స్థిరమైన వడ్డీరేట్లు వంటివి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఇండియా పోస్ట్ (India Post) అందించే పొదుపు, పెట్టుబడి ఆప్షన్లలో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ (Post Office MIS). ఇందులో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి, స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించవచ్చు. మీ సమీపంలోని పోస్టాఫీసులో ఈ పథకం కింద అకౌంట్‌ను ఓపెన్ చేసి, పెట్టుబడి ప్రారంభించవచ్చు.

లాక్-ఇన్ పీరియడ్ ఎంత?


పోస్టాఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుంది. మెచూరిటీ తరువాత ఇన్వెస్టర్లు పెట్టుబడి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ.1,000 కంటే తక్కువ మొత్తంతో పెట్టుబడులు ప్రారంభించవచ్చు. పోస్టాఫీస్ అందించే గ్యారెంటీ రిటర్న్‌లతో పాటు, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C నిబంధనల ప్రకారం పన్ను ప్రయోజనాలను కూడా డిపాజిటర్లు పొందవచ్చు.

GST Hike: అలర్ట్... దుస్తులు, చెప్పులు కొనాలా? ధరలు పెరగబోతున్నాయి

పెట్టుబడి, వడ్డీ


పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో ఖాతాదారులు వ్యక్తిగతంగా రూ. 4.5 లక్షల వరకు లేదా సంయుక్తంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వీటిపై వడ్డీ రేట్లను మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం సవరిస్తుంది. సెప్టెంబర్ 30, 2021తో ముగిసే త్రైమాసికానికి ఈ పెట్టుబడుల వడ్డీ రేటును సంవత్సరానికి 6.6%గా నిర్ణయించారు. పెట్టుబడిదారులు నేరుగా పోస్టాఫీసు నుంచి వడ్డీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా వారి సేవింగ్స్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పోస్టాఫీస్ ఇటీవల రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌కు సైతం ఇలాంటి నిధులను ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పథకంలో రూ. 4 లక్షలు పెట్టుబడి పెడితే.. ఇన్వెస్టర్ నెలవారీ ఆదాయం లేదా రాబడిగా రూ. 2000 అందుకుంటారు. మెచూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత అసలు మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. లేదా ఆ మొత్తాన్ని తిరిగి పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

SBI ATM: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయండి ఇలా

అర్హతలు


POMIS ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ భారతీయులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను అందించడం ద్వారా సమీపంలోని పోస్టాఫీసులో ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్ల కోసం కూడా POMIS అకౌంట్లను తెరవవచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే వారు మొత్తం ప్రయోజనాలను పొందగలుగుతారు.

ప్రీ-మెచూర్ విత్‌డ్రా


పోస్టాఫీస్ MISలో చేసిన పెట్టుబడిని మెచూరిటీ పూర్తయ్యేలోపు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా చేస్తే జరిమానా వర్తిస్తుంది. ఒక ఇన్వెస్టర్ మొదటి సంవత్సరం పూర్తి కాకముందే తమ పెట్టుబడిని వెనక్కు తీసుకుంటే.. వారు ఎలాంటి ప్రయోజనాలకు అర్హులు కారు. ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య చేసిన ఏదైనా ప్రీమెచూర్ విత్‌డ్రాలపై 2 శాతం పెనాల్టీ వర్తిస్తుంది. మూడు నుంచి ఐదేళ్ల మధ్య ఇలా డబ్బు తీసుకుంటే 1 శాతం పెనాల్టీ విధిస్తారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: India post, Personal Finance, Post office, Post office scheme, Postal department, Recurring Deposits

ఉత్తమ కథలు