Pollution-eating car: కాలుష్యాన్ని పీల్చుకునే సరికొత్త కారు.. ఎలా పని చేస్తుందంటే..

ప్రతీకాత్మకచిత్రం

బ్రిటన్​కు చెందిన ప్రముఖ డిజైనర్​ థామస్ హీథర్​విక్​. కారు నడిపే కొద్దీ.. గాలిలోని కాలుష్యాన్ని ఇది పీల్చుకుంటుందని వెల్లడించారు. ఈ కారును షాంఘైలో జరిగిన గుల్​వుడ్​ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్​లో ప్రదర్శించారు.

  • Share this:
సాధారణంగా కార్ల వల్ల కాలుష్యం వెలువడుతుంది. ముఖ్యంగా ఇంధనంతో నడిచే వాహనాల నుంచి కర్బన ఉద్గారాలు విడుదలై గాలి కలుషితమవుతుంది. ఇప్పటికే కార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ప్రధాన నగరాల్లో కాలుష్య సమస్య తీవ్రమవుతోంది. అందుకే పొల్యూషన్​ను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఏకంగా కాలుష్యాన్ని పీల్చుకొనే కారును తయారు చేశానంటున్నారు బ్రిటన్​కు చెందిన ప్రముఖ డిజైనర్​ థామస్ హీథర్​విక్​. కారు నడిపే కొద్దీ.. గాలిలోని కాలుష్యాన్ని ఇది పీల్చుకుంటుందని వెల్లడించారు. ఈ కారును షాంఘైలో జరిగిన గుల్​వుడ్​ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్​లో ప్రదర్శించారు.

తాను డిజైన్ చేసిన కాలుష్యాన్ని పీల్చుకునే కార్లు చైనా తయారవుతాయని థామస్ హీథర్​విక్ చెప్పారు. అలాగే 2023 లోపు 10 లక్షల కార్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కాలుష్య నివారణతో స్పేస్ క్రైసిస్​ను తగ్గించేందుకు ఇలాంటి కారును డిజైన్ చేశానని చెప్పారు. కాలిఫోర్నియా, లండన్​లో గూగుల్ హెడ్​క్వార్టర్స్ నిర్మాణంలో ఆర్కిటెక్చర్ ప్రాజెక్టులు చేపట్టి థామస్ ఫేమస్ అయ్యారు. ఈ కాలుష్యాన్ని పీల్చుకునే కారు గురించి కొందరు విమర్శకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో థామస్​ హీథర్​విక్ దీని గురించిన పూర్తి వివరాలు తెలిపారు. ఎలా పని చేస్తుందో వివరించారు.

“మమ్మల్ని చైనాకు చెందిన ఐఎం మోటార్స్ సంప్రదించింది. అంతకు ముందు మేము కార్లను డిజైన్ చేయలేదని చెప్పినా.. వారు ఈ ప్రాజెక్టు మీరే చేయాలని రిక్వెస్ట్ చేశారు” అని థామస్ చెప్పారు. ఈ కారుకు పెద్ద గ్లాస్​ రూఫ్​ ఉండడంతో పాటు కారు లోపల మొత్తం ఓ రూమ్​లా ఉంటుంది. అడ్జస్టబుల్​ చైర్లు ఉండగా.. వాటిని నిద్రపోయేందుకు బెడ్ లాగా కూడా వాడుకునే సదుపాయం ఉంది. సమావేశాలు, భోజనం చేసేందుకు మధ్యలో ఓ టేబుల్​ కూడా ఉంటుంది.

“కార్ల ఉత్పత్తిదారులు చాలా మంది ఎలక్ట్రిక్​ కార్లు తయారు చేస్తున్నారు. అయితే సాధాణంగా కేవలం లుక్ మాత్రమే మార్చి కాకుండా.. ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నా. అందుకే కాలుష్యాన్ని తగ్గించేలా ప్లాన్ చేశా. కారు ముందు భాగంలో గ్రిల్ వద్ద టెన్నిస్ బాల్ సైజ్​లో ఓ ఫిల్టర్ ఉంటుంది. అది కాలుష్యాన్ని పీల్చుకుంటుంది. ఏడాది కల్లా ఆ సైజులో పొల్యూషన్​ను అది దాచుకుంటుంది. ఆలోచించేందుకు టెన్నిస్ బాల్ చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ అది మన ఊపిరితిత్తులంత ఉంటుంది. అందుకే గాలి నాణ్యత పెంచడంలో ఈ కారు ఉపయోగపడుతుంది. ఈ కార్లు లక్షలాదిగా రోడ్లపైకి వస్తే గాలి కాలుష్యం చాలా తగ్గే అవకాశం ఉంటుంది” అని థామస్ హీథర్​విక్ చెప్పారు.
Published by:Krishna Adithya
First published: