news18-telugu
Updated: December 20, 2020, 3:50 PM IST
Job Loss Insurance: ఉద్యోగం పోతే ఇన్స్యూరెన్స్... వారానికి రూ.1,00,000 వరకు బెనిఫిట్
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ మహమ్మారి లక్షల ఉద్యోగాలకు ముప్పు తీసుకొచ్చింది. ఇప్పటికే లక్షల్లో ఉద్యోగాలు కోల్పోయినవారు ఉన్నారు. ఈ పరిస్థతి ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు. కొత్త ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉద్యోగాలు ఉన్నవారిలో కూడా ఏదో తెలియని భయం. ఈ ఉద్యోగాలు ఎంతకాలం ఉంటాయా అన్న ఆందోళన. ఉద్యోగం పోతే ఆదాయం పోతుంది. ఆదాయం కోల్పోతే కుటుంబాన్ని నడపడం కష్టమవుతుంది. ఇలాంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ ఇన్స్యూరెన్స్ మార్కెట్‌ప్లేస్ అయిన పాలసీబజార్ జాబ్ లాస్ పేరుతో ప్రత్యేక వర్టికల్ను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్లో ఎస్బీఐ జనరల్, శ్రీరామ్ జనరల్, యూనివర్సల్ సోంపో, ఆదిత్య బిర్లా ఇన్స్యూరెన్స్ సంస్థల నుంచి ఇన్కమ్ లాస్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం జాబ్ లాస్ లేదా ఇన్కమ్ లాస్ ఇన్స్యూరెన్స్ కవరేజీ అందించే పాలసీలు మార్కెట్లో అంత పాపులర్ కావు. ప్రస్తుతం ఉన్న పాలసీల్లో బెస్ట్ పాలసీలను పాలసీ బజార్లో కంపేర్ చేసి అక్కడే పాలసీ కొనొచ్చు. కేవలం ఉద్యోగులకు మాత్రమే ఈ పాలసీ కాదు. స్వయం ఉపాధి పొందుతున్నవారు కూడా తీసుకోవచ్చు.
EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే ఈ 4 ప్రయోజనాలు మీకేGold Price Today: ఈరోజు బంగారం రేట్ ఎంత? ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తెలుస్తుంది
ఈ ప్లాన్‌లో కవరేజీ రెండు రకాలుగా ఉంటుంది. యాజమాన్యం ఉద్యోగుల నుంచి తొలగిస్తే కవరేజీ పొందడం ఒక పద్ధతి. ఇక అంగవైకల్యం, మరణం ద్వారా ఉద్యోగం కోల్పోతే బీమా పొందడం మరో పద్ధతి. యాజమాన్యం తొలగించడం ద్వారా ఉద్యోగం కోల్పోతే మూడు నెలల వరకు లోన్లను ఇన్స్యూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా పాక్షికంగా, శాశ్వతంగా అంగవైకల్యం బారినపడ్డా, మరణించినా ప్రతీ వారం కొంత వేతనం రెండేళ్ల పాటు లభిస్తుంది.
ఉద్యోగి మరణిస్తే ఇన్స్యూరెన్స్ డబ్బుల్ని నామినీకి చెల్లిస్తారు. ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందుతున్నవారికి వేర్వేరు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా పాలసీని ఎంచుకోవచ్చు. వారానికి గరిష్టంగా రూ.1 లక్ష వరకు 100 వారాల వరకు పొదే అవకాశం ఉంది. ఎంచుకునే పాలసీని బట్టి ప్రీమియం ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న కస్టమర్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు.
Published by:
Santhosh Kumar S
First published:
December 20, 2020, 3:47 PM IST