news18-telugu
Updated: December 6, 2020, 2:16 AM IST
ప్రతీకాత్మక చిత్రం
నోయిడా లో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. సెక్స్ రాకెట్ నిర్వాహాకులను యూపీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. నేపాల్, బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి జోరుగా సాగుతున్న వీరి వ్యభిచార కూపంలో 20 మంది అమ్మాయిలు ఇరుక్కోగా వారికి విముక్తి కల్పించారు పోలీసులు. పోలీసులు ఇప్పటికే ఒక నిర్వాహకుడిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాలు మొత్తం ఆన్ లైన్లోనే జరిగేవి. నోయిడా చెందిన మోహిత్, ఢిల్లీకి చెందిన ఒక మహిళతో పాటు మరో వ్యక్తి నోయిడా లో ఈ వ్యభిచార వ్యాపారం ఆన్ లైన్లో నడిపేవారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యభిచార నిర్వాహకులతో మాట్లాడి అక్కడి నుంచి అమ్మాయిలను నోయిడా కు తీసుకువచ్చేవారు. తరువాత వారిని అద్దె ఇంట్లో ఉంచి ఆన్ లైన్లో వారి ఫోటోలను షేర్ చేసేవారు.
ఎవరైనా సంప్రదిస్తే వారి గురించి ఆరాతీసి సేఫ్ అనిపిస్తే అప్పుడు వారి దగ్గర కొంత డబ్బు అడ్వాన్స్ గా తీసుకుని ముందే అనుకున్న సమయానికి అమ్మాయిలను అక్కడికి తీసుకెళ్లేవారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించి వ్యభిచార దంధా గుట్టు రట్టు చేశారు.
Published by:
Krishna Adithya
First published:
December 6, 2020, 2:14 AM IST