POGO THE KIDS ENTERTAINMENT CHANNEL NOW AVAILABLE IN TELUGU MK
పిల్లల చానల్ POGO ఇప్పుడు తెలుగు భాషలో..ప్రాంతీయ ఉనికి విస్తరించుకుంటున్న స్థానిక కార్టూన్ చానల్
ప్రతీకాత్మకచిత్రం
కొత్తగా తెలుగు భాష తో POGO – WarnerMedia కిడ్స్ ఎంటర్టెయిన్మెంట్ టీవీ చానల్ – భారతదేశంలో మరెన్నో ఇళ్ళను చేరుకోనుంది. ఈ అదనపు ఫీడ్ తో 100% స్వదేశీ యానిమేషన్ కోసం దేశంలోని ప్రముఖ బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో తన వీక్షకుల సంఖ్యను పెంచుకోనుంది.
కొత్తగా తెలుగు భాష తో POGO – WarnerMedia కిడ్స్ ఎంటర్టెయిన్మెంట్ టీవీ చానల్ – భారతదేశంలో మరెన్నో ఇళ్ళను చేరుకోనుంది. ఈ అదనపు ఫీడ్ తో 100% స్వదేశీ యానిమేషన్ కోసం దేశంలోని ప్రముఖ బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో తన వీక్షకుల సంఖ్యను పెంచుకోనుంది. POGO ఫ్యాన్ – ఫస్ట్ వ్యూహంలో స్థానిక కంటెంట్ అనేది కీలకంగా ఉంది. దీని ఇటీవలి లోకల్ ఒరిజినల్స్ వీక్షకుల నుంచి చక్కటి స్పందన పొందాయి. ఇటీవలి కాలంలో చానల్ కు సంబంధించి అత్యంత విజయవంతమైన కామెడీ సిరీస్ లలో ఒకటైన ‘Titoo – Har Jawaab Ka Sawal Hu’ బాలీవుడ్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఒరిజినల్ ‘Smashing Simmba’ మరియు ‘Chhota Bheem’ వంటి కార్టూన్స్ ను చిన్నారులు, కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందించారు. ఎంతో వినోదాత్మకంగా ఉండే ‘Bandhbudh aur Budbak’ కూడా ఇప్పుడు తెలుగులో లభ్యమవుతుంది.
ఈ ఆవిష్కరణ గురించి Cartoon Network అండ్ POGO సౌతేషియా నెట్వర్క్ హెడ్ అభిషేక్ దత్తా మాట్లాడుతూ, ‘‘POGO తెలుగు భాషా ఫీడ్ రూపకల్పన అనేది మా చిన్నారి వీక్షకుల కోసం స్థానిక యానిమేషన్ కంటెంట్ ను అందిస్తామనే మా కట్టుబాటును నెరవేర్చుకోవడంలో ఓ అడుగు. ప్రపంచస్థాయి యానిమేషన్ లను, కథలను భారతదేశంలో మరెందరికో అందించే అవకాశం ఇది’’ అని అన్నారు.POGO ఇప్పటికే తమిళం మరియు హిందీ భాష లలో అందుబాటులో ఉంది.
POGO గురించి:
మరింత చరుగ్గా ఉండే, స్మార్ట్ గా ఆడుకునే, భారీగా ఆలోచించే, పెద్ద కలలు కనే నేటి తరం కోసం రూపుది ద్దుకున్నది WarnerMedia కు చెందిన ఓన్లీ ఫర్ ఇండియా కిడ్స్ ఎంటర్ టెయిన్ మెంట్ నెట్ వర్క్ POGO. POGO అగ్రగామి పిల్లల చానల్. కామెడీ, యాక్షన్ మొదలుకొని గేమ్స్, క్యూరియాసిటీ దాకా వివిధ రకాల కంటెంట్ ను ఈ చానల్ అందిస్తుంది. Lambu-G Tingu-G, Smashing Simmba, Chhota Bheem, Titoo – Har Jawaab Ka Sawaal Hu వంటి దేశీయంగా రూపొందించిన ప్రఖ్యాత షోలకు నిలయం. భారతదేశంలో POGO హిందీ, తమిళం, తెలుగులలో లభ్యమవుతుంది. POGO అనేది Cartoon Network కు కంపానియన్ చానల్. WarnerMedia International చే క్రియేట్ చేయబడి, పంపిణి చేయబడే బ్రాండ్.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.