పోకో సంస్థ వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు కనబరుస్తుంది. ధరకు తగ్గ స్పెసిఫికేషన్లను ఇస్తుండడంతో పోకో సేల్స్ ఇటీవల బాగా పెరిగాయి. దీంతో కంపెనీ కూడా వరుస పెట్టి మోడళ్లను రిలీజ్ చేస్తోంది. తాజా భారత్‌లో పోకో ఎఫ్3 జీటీ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసిన పోకో.. కొత్తగా ఎక్స్3 జీటీని మార్కెట్లలోకి తీసుకురానుంది. ఈ నెల 28న మలేషియాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది రెడ్మీ నోట్ 10 ప్రో 5జీని పోలి ఉంది. మరి పోకో ఎక్స్3 జీటీ స్పెక్స్ ఎంటో చూడండి.
పోకో ఎక్స్3 జీటీ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ఎస్వోసీతో వస్తోంది. డైమన్సిటీ 1200 తర్వాత మీడియాటెక్ నుంచి వచ్చిన రెండో పవర్ఫుల్ చిప్సెట్ ఇది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపెసిటీతో వచ్చే ఈ ఫోన్ 67 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ విషయాలను పొకో పోస్టర్ల ద్వారా తెలియజేయగా.. పూర్తి స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. అవేంటంటే
పోకో ఎక్స్3 జీటీ 6.6 అంగుళాల ఫుల్ హెడ్ ప్లస్ స్క్రీన్‌తో రానుంది. అలాగే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గోరిల్లాగ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండనుంది. ఇక ఎల్సీడీ ప్యానెల్ కావడంతో ఇన్ డిస్ల్పే కాకుండా లాక్బటన్కే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో మూడు ఉండనున్నాయి. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.. పంచ్‌హోల్ డిజైన్‌తో వస్తోంది. వేరియంట్ల విషయానికి వస్తే 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ నుంచి 12 జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజీ వరకు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
ఇక ఆండ్రాయిడ్ 11, ఎంఐయూఐ 12.5 వెర్షన్ తో పోకో ఎక్స్3 జీటీ విడుదల కానుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ల చార్జింగ్ స్పీడ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కాగా ఈ నెల 28న మలేషియాలో విడుదల కానున్న ఎక్స్3 జీటీ మోడల్‌ను పోకో భారత్‌లోకి తీసుకొస్తుందా లేదా అన్నది ఇంకా ప్రకటించలేదు. ఇక ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.17వేల లోపే ఉండే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smartphones