హోమ్ /వార్తలు /బిజినెస్ /

POCO M3 Pro 5G: పోకో నుండి మొట్టమొదటి 5 జీ స్మార్ట్​ఫోన్​... స్పెసిఫికేషన్ల వివరాలివే

POCO M3 Pro 5G: పోకో నుండి మొట్టమొదటి 5 జీ స్మార్ట్​ఫోన్​... స్పెసిఫికేషన్ల వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

POCO M3 Pro 5G | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? త్వరలో ఇండియాలో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది పోకో ఇండియా.

భారత మార్కెట్​లోకి పోకో ఇండియా దూకుడుగా కొత్త స్మార్ట్​ఫోన్లను లాంఛ్​ చేస్తోంది. ఫిబ్రవరిలో పోకో ఎం3 మోడల్​ను విడుదల చేసిన పోకో.. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఎం3 ప్రో 5జీ మోడల్​ లాంఛ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మోడల్​ BIS, FCC సర్టిఫికేషన్ లిస్టింగ్​లో M2103K19PG మోడల్​ నంబర్​తో చేర్చబడింది.​ కాగా, భారత మార్కెట్​లోకి పోకో నుండి వస్తోన్న మొట్టమొదటి 5జీ స్మార్ట్​ఫోన్ ఇదే కావడం విశేషం. పోకో ఎం3 ప్రో 5జీ రెడ్‌మీ నోట్​ 10 5G స్మార్ట్​ఫోన్​కి రీ బ్రాండెడ్​ వెర్షన్​గా విడుదలవుతోంది. దీనిలోని ఫీచర్లు రెడ్​మీ నోట్​ 10తో సమానంగా ఉంటాయి. కాగా, రెడ్​మీ నోట్ 10 మోడల్​​​ ఇటీవలే ‘M2103K19G’ మోడల్​ నంబర్​తో గ్లోబల్ మార్కెట్​లో ప్రారంభించబడింది. అయితే, పోకో ఎం3 ప్రో మోడల్​ లాంచింగ్​ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ఇప్పుడు దీనికి BIS సర్టిఫికేషన్​ లభించడంతో అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్​ తొలుత 2021 జనవరిలోనే లాంఛ్​ కానుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ, కొన్ని కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఇదే సిరీస్​లో భారత మార్కెట్​లోకి విడుదలైన POCO M2 ప్రో విజయవంతం కావడంతో ఇప్పుడు M3 ప్రో లాంఛింగ్​కు మార్గం సుగమం అయ్యింది. FCC లిస్టింగ్​లో చేర్చిన వివరాలను బట్టి చూస్తే.. దీనిలో 22W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, MIUI 12, బ్లూటూత్ 5.1 సపోర్ట్​ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Sony Xperia: మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసిన సోనీ... అదిరిపోయిన ఫీచర్స్

Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో రూ.2,499 ధరకే కొనండి ఇలా

రెడ్‌మీ నోట్ 10 5 జీ స్పెసిఫికేషన్లు


పోకో ఎం3 ప్రో మోడల్​ ఫీచర్లు సరిగ్గా రెడ్‌మీ నోట్ 10 5 జీ మోడల్ ని పోలి ఉంటాయి. రెడ్​మీ నోట్​ 10 5జీ వేరియంట్​ ఫీచర్లను పరిశీలిస్తే.. దీనిలో​ 6.5-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్​ ఎల్‌సిడి డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్​ప్లేలో సెంటర్- పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, 20: 9 కారక నిష్పత్తి, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​ వంటి వాటిని చేర్చింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్​కు మాలి-జి 57 MC2 GPU చిప్​సెట్తో శక్తినిస్తుంది. కాగా, ఈ స్మార్ట్​ఫోన్​​ 4GB RAM, 128GB స్టోరేజ్‌ గల ఒకే ఒక్క వేరియంట్​లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన ఈ ఫోన్​లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది.

WhatsApp: మీరు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

Find My Device: స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

ఇక, కెమెరాల విషయానికొస్తే, రెడ్‌మీ నోట్ 10 5జీ వేరియంట్​లో వెనుక భాగాన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను చేర్చింది. ఈ సెటప్​లో 48 ఎంపి ప్రైమరీ సెన్సార్, 2 ఎంపి డెప్త్ సెన్సార్, 2 ఎంపి మాక్రో లెన్స్ వంటివి ఉంటాయి. సెల్ఫీ, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ప్రత్యేకంగా 8 ఎంపీ స్నాపర్ కెమెరాను చేర్చింది. ఇక, సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, హాయ్-రెస్ ఆడియో వంటి ఫీచర్లను జోడించింది. కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. దీనిలో డ్యూయల్-బ్యాండ్ 4 జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, యుఎస్​బీ టైప్-సి పోర్ట్ వంటివి అందించింది. కాగా, అధికారికంగా దీని ధరను మాత్రం వెల్లడించలేదు. అతి త్వరలోనే దీని ధర, ఫీచర్లు, లాంఛ్ తేదీ సంబంధించిన వివరాలను ఆశించవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones

ఉత్తమ కథలు