హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pocket Money Apps: యువత లక్ష్యంగా వస్తున్న పాకెట్‌మనీ యాప్స్‌.. ఆ లెక్కలివే..!

Pocket Money Apps: యువత లక్ష్యంగా వస్తున్న పాకెట్‌మనీ యాప్స్‌.. ఆ లెక్కలివే..!

Pocket Money Apps: యువత లక్ష్యంగా వస్తున్న పాకెట్‌మనీ యాప్స్‌.. ఆ లెక్కలివే..!

Pocket Money Apps: యువత లక్ష్యంగా వస్తున్న పాకెట్‌మనీ యాప్స్‌.. ఆ లెక్కలివే..!

Pocket Money Apps: స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారి సంఖ్య పెరగడంతో డిజిటల్ బ్యాంకింగ్ రంగం ఏటేటా వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా డిజిటల్ వ్యాలెట్స్‌, కాంటాక్ట్‌లెస్ కార్డ్స్, డిజిటల్ పేమెంట్స్ యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకింగ్‌ సేవలు స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)లో లభిస్తున్నాయి. అన్ని రకాల పేమెంట్లు, మనీ ట్రాన్స్‌ఫర్లు ఫోన్‌ ద్వారా చేసేయవచ్చు. టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారి సంఖ్య పెరగడంతో డిజిటల్ బ్యాంకింగ్ రంగం ఏటేటా వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా డిజిటల్ వ్యాలెట్స్‌, కాంటాక్ట్‌లెస్ కార్డ్స్, డిజిటల్ పేమెంట్స్ యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. దేశంలో 350 మిలియన్ల మంది యువత ఉన్నారు. వీరి లక్ష్యంగా యూత్-సెంట్రిక్ నియోబ్యాంక్స్, పాకెట్‌మనీ యాప్స్‌తో ఫిన్‌టెక్ స్పేస్ 2023లో మరింత వృద్ధిని కనబర్చే అవకాశం ఉంది.

* డిజిటల్ వ్యాలెట్స్‌పై 93 శాతం యువత ఆరా

2022లో దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన టీనేజ్-ఫోకస్డ్ ఫైనాన్షియల్ లిటరసీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 87 శాతం మంది యువకులు తమ తల్లిదండ్రులతో డబ్బు, పొదుపు గురించి చర్చిస్తున్నారని సర్వే‌లో తేలింది. దాదాపు 93 శాతం మంది యువకులు డిజిటల్ వ్యాలెట్స్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వారిలో 70 శాతం మంది బ్లాక్‌చెయిన్, NFTs వంటి క్రిప్టో అసెట్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారని సర్వే పేర్కొంది.

* యువత లక్ష్యంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు

ఆర్థిక విషయాల్లో యువత మరింత ప్రాక్టికల్‌గా వ్యవహరించడానికి ఇప్పుడు వివిధ మార్గాలు ఉన్నాయి. మైనర్‌, బ్యాంక్ అకౌంట్‌ ఓపెన్‌ చేయడమనేది పాకెట్ మనీ యాప్స్ వంటి ఫిన్‌టెక్ ఎంటిటీలతో పోలిస్తే చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. దీంతో డిజిటల్‌ బ్యాకింగ్ ప్రక్రియ మరింత సులభతరం చేసింది. Gen-Z పాకెట్ మనీ యాప్‌లతో పోలిస్తే మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు అన్నింటికి సరిపోయే విధంగా ఉంటాయి. ఇవి యువకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

ఇది కూడా చదవండి :  మెరుగైన భవిష్యత్తు కోసం.. 10 అద్భుతమైన ఆర్థిక చిట్కాలు.. 25 ఏళ్ల నుంచే పాటిస్తే మేలు!

పర్సనల్ ఫైనాన్స్‌ స్కిల్స్ పెంపొందించుకోవడమనేది యువత వ్యక్తిగత తపనతో ముడిపడి ఉంటుంది. డిజిటల్‌గా అవగాహన ఉన్న ఈతరం యువత సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. దీంతో పాకెట్ మనీ యాప్‌లు గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపనున్నాయి. పాకెట్ మనీ యాప్‌లకు చెందిన ప్రీపెయిడ్ కార్డ్‌లు ఆర్థిక అవసరాలకు కీలకంగా మారనున్నాయి.

* టీనేజ్‌కి UPI యాక్సెస్‌‌?

ఈ ఏడాది యుక్తవయసులోని వారికి UPI యాక్సెస్‌‌కు అవకాశం కల్పించవచ్చు. ఈ చర్య కారణంగా పాకెట్ మనీ యాప్‌ల వినియోగ రేటు పెరిగే అవకాశం ఉంది. కిరాణం మొదలుకొని రిటైల్, ఫుడ్ డెలివరీ, దుస్తులు వంటి వ్యాపారులతో యుక్తవయసులోని వారు మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

* ప్రీపెయిడ్ కార్డ్‌లతో P2P ట్రాన్స్‌ఫర్

యుక్త వయసు యువత ఆర్థిక అవసరాల కోసం ఫిన్‌టెక్ సంస్థలు మెరుగైన వాలెట్ పరిమితిని అందించవచ్చు. టీనేజ్‌ యువత ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవడం, పాకెట్ మనీ యాప్‌లు అందించే ప్రీపెయిడ్ కార్డ్‌లను ఉపయోగించి పీర్-టు-పీర్ (P2P) ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం ఉండవచ్చు. వివిధ రిటైల్ బ్రాండ్స్పాకెట్ మనీ యాప్‌ల భాగస్వామ్యంతో మరిన్ని క్యూరేటెడ్ డిస్కౌంట్స్, రివార్డ్‌లను సైతం అందించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

* 2025 నాటికి 85 బిలియన్ల డాలర్లు

కాగా భారత్‌లో ఫిన్‌టెక్ మార్కెట్ 2019లో 26.3 బిలియన్ డాలర్లు కాగా, 2025 నాటికి 85 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీనేజ్ పిల్లల అవసరాలను తీర్చే ఫిన్‌టెక్ ఎకో సిస్టమ్ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో దీనిపై దృష్టి సారించి గణనీయమైన ప్రయోజనం పొందేందుకు సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

First published:

Tags: Money, Money app, Personal Finance

ఉత్తమ కథలు