హోమ్ /వార్తలు /బిజినెస్ /

Loan: ఎస్‌బీఐ, పీఎన్‌బీ స్పెషల్ స్కీమ్స్.. వారికి రూ.10 లక్షల లోన్!

Loan: ఎస్‌బీఐ, పీఎన్‌బీ స్పెషల్ స్కీమ్స్.. వారికి రూ.10 లక్షల లోన్!

Loan: ఎస్‌బీఐ, పీఎన్‌బీ స్పెషల్ స్కీమ్స్.. వారికి రూ.10 లక్షల లోన్!

Loan: ఎస్‌బీఐ, పీఎన్‌బీ స్పెషల్ స్కీమ్స్.. వారికి రూ.10 లక్షల లోన్!

Punjab National Bank | మీరు లోన్ పొందాలని భావిస్తున్నారా? అయితే 60 ఏళ్లకు పైన వయసు ఉందా? అయితే ఇబ్బంది ఏమీ లేదు. మీరు బ్యాంకుల నుంచి లోన్ పొందొచ్చు. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

State Bank of India | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లకు పలు రకాల సర్వీసులు అందిస్తున్నాయి. వీటిల్లో లోన్ సర్వీసులు కూడా ఉన్నాయి. కస్టమర్లు సులభంగానే ఈ బ్యాంకుల నుంచి లోన్ పొందొచ్చు. అంతేకాకుండా బ్యాంకులు పెన్షనర్లకు కూడా అంటే 60 ఏళ్లు దాటిన వారికి కూడా రుణాలు అందిస్తున్నాయి. బ్యాంకులు వీరి కోసం పెన్షన్ లోన్ స్కీమ్స్‌ను అందుబాటులో ఉంచాయి. తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఈజీగా త్వరితగతిన ఈ రుణాలు పొందొచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకారం చూస్తే.. పెనన్ష్ మొత్తం ఆధారంగా లోన్ అమౌంట్ నిర్ణయమౌతుంది. మీ వయసు 70 ఏళ్ల వరకు ఉంటే.. ఈ స్కీమ్ కింద కనీసం రూ. 25 వేల రుణం పొందొచ్చు. అలాగే గరిష్టంగా రూ. 10 లక్షల వరకు లోన్ వస్తుంది. లేదంటే పెన్షన్ మొత్తానికి 18 రెట్లు ఎక్కువగా లోన్ పొందొచ్చు. అదే డిఫెన్స్ రంగానికి చెందిన పెన్షనర్లు అయితే వారి పెన్షన్ మొత్తానికి 20 రెట్లు ఎక్కువగా పర్సనల్ లోన్ పొందొచ్చు.

బజాజ్ ఫైనాన్స్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

పెన్షనర్ల వయసు 70 నుంచి 75 ఏళ్ల వరకు ఉంటే.. వారికి రూ.7.5 లక్షల వరకు లోన్ వస్తుంది. అలాగే 75 ఏళ్లకు పైన వయసు ఉంటే లోన్ మొత్తం రూ. 5 లక్షల వరకు లభిస్తుంది. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ లోన్ పొందాలని భావిస్తే.. 76 ఏళ్లకు లోపు వయసు ఉండాలి. తీసుకున్న రుణాన్ని 72 నెలలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వయసు ప్రాతిపదికన లోన్ టెన్యూర్ కూడా మారుతుందని గుర్తించుకోవాలి.

ఇక ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 3 రోజులే.. 5 రోజులు సెలవులు!

అంతేకాకుండా ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది. అలాగే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ మాత్రం కచ్చితంగా కావాలి. అప్పుడు లోన్ పొందటం వీలవుతుంది. ఇంకా పెన్షన్ లోన్స్‌పై ఇతర హిడెన్ చార్జీలు కూడా ఉండవు. మీరు మీకు దగ్గరిలోని ఎస్‌బీఐ లేదా పీఎన్‌బీ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి లోన్ వివరాలు తెలుసుకోవచ్చు. అర్హత ప్రాతిపదికన మీకు రుణం లభిస్తుంది. మీరు ఏ బ్యాంక్‌లో అయితే లోన్ తీసుకోవాలని భావిస్తున్నారో.. ఆ బ్యాంక్‌లోనే పెన్షన్ పేమెంట్ ఆర్గర్‌ను కలిగి ఉండాలి. అప్పుడు మీకు ఆ బ్యాంక్‌లో లోన్ వస్తుంది. వడ్డీ రేటు 11.05 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.

First published:

Tags: Banks, Pensions, Punjab National Bank, Sbi, State bank of india

ఉత్తమ కథలు