హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Loan: రైతులకు బ్యాంక్ శుభవార్త.. ఇక మిస్డ్ కాల్‌తో లోన్ పొందండి!

Bank Loan: రైతులకు బ్యాంక్ శుభవార్త.. ఇక మిస్డ్ కాల్‌తో లోన్ పొందండి!

Bank Loan: రైతులకు బ్యాంక్ శుభవార్త.. ఇక మిస్డ్ కాల్‌తో లోన్ పొందండి!

Bank Loan: రైతులకు బ్యాంక్ శుభవార్త.. ఇక మిస్డ్ కాల్‌తో లోన్ పొందండి!

Punjab National Bank | రైతులకు బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. మిస్డ్ కాల్ ద్వారా కూడా లోన్ పొందొచ్చని వెల్లడించింది. అర్హత కలిగిన రైతులకు సులభంగానే రుణాలు పొందొచ్చని పేర్కొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Agriculture Loan| ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తీపికబురు అందించింది. కీలక ప్రకటన చేసింది. రైతులకు మరింత సులభంగా రుణాలు అందించేందుకు రెడీ అవుతోంది. కేవలం మిస్డ్ కాల్ ద్వారా బ్యాంక్ (Bank) నుంచి లోన్ పొందొచ్చని వెల్లడించింది. బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో రైతులకు ఊరట కలుగుతుందని చెప్పకోవచ్చు.

రైతులు వివిధ మార్గాల్లో బ్యాంక్ నుంచి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చ. ఎస్ఎంఎస్ పంపండం, లేదంటే మిస్డ్ కాల్ ఇవ్వడం, నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్ వంటి వాటి ద్వారా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. ఏ ఏ మార్గాల్లో ఎలా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చొ ఇప్పుడ ఒకసారి తెలుసుకుందా. లోన్ అని టైప్ చేసి 56070 అనే నెంబర్2కు ఎస్ఎంఎస్ పంపొచ్చు.

బంపరాఫర్లు.. ఒక బైక్‌పై రూ.35 వేల తగ్గింపు, మరో బైక్‌పై రూ.10,000 డిస్కౌంట్!

లేదంటే 18001805555 నెంబర్‌కు మిస్డ కాల్ ఇవ్వొచ్చు. అలాగే 18001802222 అనే కాల్ సెంటర్ నెంబర్‌కు కూడా కాల్ చేయొచ్చు. ఈ ఆప్షన్లు కాకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే పీఎన్‌బీ వన్ అనే యాప్‌ను బ్యాంక్ అందిస్తోంది. ఈ యాప్‌లోకి లాగిన్ అయ్యి లోన్ కోసం అప్లై చేయొచ్చు. అర్హత కలిగిన బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని గుర్తించుకోవాలి.

రైతుల కోసం 6 అదిరిపోయే స్కీమ్స్.. ప్రతి ఏడాది అకౌంట్లలోకి రూ.42 వేలు, సులభంగా రుణాలు!

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ అందిస్తోంది. ఈ పథకం కింద రైతులకు బ్యాంకులు రూ. 3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నాయి. ఇంకా వడ్డీ రాయితీ ప్రయోజనం కూడా లభిస్తోంది. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించే రైతుకలు కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీతో కలుపుకుంటే రైతులకు 7 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే.. 3 శాతంతగ్గింపు వస్తుంది. అంటే కేవలం 4 శాతం వడ్డీకే లోన్ పొందొచ్చని చెప్పుకోవచ్చు. బ్యాంకులు అన్నీ కూడా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు అందిస్తున్నాయి. వీటిని కేసీసీ లోన్స్ అని కూడా పిలుస్తుంటారు.

First published:

Tags: Bank loans, Banks, PM KISAN, Punjab National Bank

ఉత్తమ కథలు