హోమ్ /వార్తలు /బిజినెస్ /

PNB ULIP Plan: PNB మెట్‌లైఫ్‌ నుంచి యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ లాంచ్‌.. కొత్త పాలసీ బెనిఫిట్స్‌ ఇవే..

PNB ULIP Plan: PNB మెట్‌లైఫ్‌ నుంచి యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ లాంచ్‌.. కొత్త పాలసీ బెనిఫిట్స్‌ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సబ్సిడరీ కంపెనీ అయిన PNB మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త పాలసీ లాంచ్ అయింది. పాలసీదారులకు జీవిత బీమా కవరేజీని అందించే PNB మెటాలైఫ్‌ గోల్ ఎన్సూరింగ్ మల్టిప్లైయర్ (GEM) ప్లాన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఇది ఒక యులిప్‌ ప్లాన్‌.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సబ్సిడరీ కంపెనీ అయిన PNB మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త పాలసీ లాంచ్ అయింది. పాలసీదారులకు జీవిత బీమా కవరేజీని అందించే PNB మెటాలైఫ్‌ గోల్ ఎన్సూరింగ్ మల్టిప్లైయర్ (GEM) ప్లాన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఇది ఒక యులిప్‌ ప్లాన్‌. GEM ప్లాన్‌ ద్వారా బీమా సదుపాయంతో పాటు భవిష్యత్తు కోసం పొదుపు కూడా చేయవచ్చు. కస్టమర్లు తాము తీసుకోగలిగే రిస్క్‌ ఆధారంగా 13 విభిన్న ఫండ్ల నుంచి తాజా ప్లాన్‌ను ఎంపిక చేసుకొనే సదుపాయం ఉంది. గోల్ బేస్డ్ ఫండ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లను కూడా ఎంచుకోవచ్చు. దీనికి టాప్-అప్ ఫీచర్ కూడా ఉంది. దీనిద్వారా కస్టమర్లు తమ కవరేజీని పెంచుకోవడానికి, పొదుపు లక్ష్యాలను వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుంది.

కొత్త ప్లాన్ అందించే కవరేజ్ ఆప్షన్స్‌

ఇన్‌కమ్ అష్యూర్డ్

దీని ద్వారా లంప్సమ్ డెత్ బెనిఫిట్‌ పొందవచ్చు. మరణం సంభవించినప్పుడు భవిష్యత్తు ప్రీమియంలను మాఫీ చేస్తుంది. కంపెనీ సేకరించిన నిధులను మెచ్యూరిటీ బెనిఫిట్‌గా చెల్లిస్తుంది, కుటుంబానికి రెగ్యులర్‌ ఇన్‌కమ్ అందజేస్తుంది.

వెల్త్ ప్లస్ కేర్

ఈ వెల్త్ ప్లస్ కేర్‌ ఫీచర్‌ ద్వారా ప్రీమియం మినహాయింపు పొందవచ్చు. ముందుగా నిర్ధారించిన ఏవైనా 5 తీవ్ర అనారోగ్యాల బారిన పడినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

వెల్త్ ఆప్షన్

ఈ ఆప్షన్‌ జీవిత బీమా రక్షణను అందిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన కలలను సాకారం చేసుకోవడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి, కార్పస్‌ను బిల్డ్‌ చేయడంలో సహాయపడుతుంది.

స్మార్ట్ చైల్డ్

కస్టమర్లు పిల్లల విద్య కోసం డబ్బు ఆదా చేయడానికి, వారి భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేయడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది.

గోల్‌ అష్యూర్డ్‌

ఇది ట్రిపుల్ బెనిఫిట్స్‌ అందిస్తుంది. లంప్సమ్ డెత్ బెనిఫిట్‌ను అందించడంతో పాటు మరణం సంభవించినప్పుడు భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలను మాఫీ చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు కూడబెట్టిన నిధులను మెచ్యూరిటీ బెనిఫిట్‌గా చెల్లిస్తుంది.

విభిన్న రకాల ఫండ్లను అందుబాటులో ఉంచడం ద్వారా మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకొనేందుకు కస్టమర్లకు సహాయపడుతున్నామని చెప్పారు PNB మెట్‌లైఫ్ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ శ్రీవాస్తవ. కొత్తగా ప్రారంభించిన PNB మెట్‌లైఫ్ గోల్ ఎన్సూరింగ్ మల్టిప్లైయర్ ప్లాన్‌తో 13 విభిన్న ఫండ్‌ల నుంచి కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను పురస్కరించుకుని, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా, ఆర్థిక సంస్కరణలు, మేక్-ఇన్-ఇండియా ప్రోగ్రామ్ వంటి కీలక అంశాలతో కూడిన "ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్"ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ప్లాన్‌ పాలసీ వ్యవధిలో తగ్గిన కొన్ని రకాల ఛార్జీలను తిరిగి ఇస్తుంది. ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు, మోర్టాలిటీ ఛార్జీలు, ప్రీమియం కేటాయింపు ఛార్జీలు ఉన్నాయి. పాలసీ నిబంధనలు, షరతులు ప్రకారం ఛార్జీలను తిరిగి పొందవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Insurance, Punjab National Bank

ఉత్తమ కథలు