Home /News /business /

PNB METLIFE LAUNCHES GUARANTEED GOAL PLAN WITH ASSURED BENEFITS GH VB

PNB Metlife: గ్యారెంటెడ్‌ గోల్ ప్లాన్​ను ఆవిష్కరించిన పీఎన్‌బీ మెట్‌లైఫ్‌.. ప్లాన్​ ప్రయోజనాల వివరాలివే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రకరకాల ప్రయోజనాలు, చెల్లింపులు, వ్యవధిని ఎంచుకోవడంలో వెసులుబాటు కల్పిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మధ్య కాలంలో అనేక కొత్త పథకాలు లాంచ్‌ చేస్తున్నాయి. వీటి వలన ఎంచుకునేందుకు కస్టమర్లకు విస్తృత ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పొదుపుతో కూడిన కొత్త జీవిత బీమా పథకాన్ని పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఈ నెల 16న విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
రకరకాల ప్రయోజనాలు, చెల్లింపులు, వ్యవధిని ఎంచుకోవడంలో వెసులుబాటు కల్పిస్తూ ఇన్సూరెన్స్(Insurance) కంపెనీలు ఈ మధ్య కాలంలో అనేక కొత్త పథకాలు లాంచ్‌ చేస్తున్నాయి. వీటి వలన ఎంచుకునేందుకు కస్టమర్లకు విస్తృత ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పొదుపుతో కూడిన కొత్త జీవిత బీమా పథకాన్ని పీఎన్‌బీ మెట్‌లైఫ్‌(MetLife) ఈ నెల 16న విడుదల చేసింది. పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ గ్యారెంటీడ్‌ గోల్‌ ప్లాన్‌ అనే పేరుతో ఉన్న ఈ పథకం హామీపూరిత రాబడితో పాటు కస్టమర్లకు తమకు నచ్చిన రీతిలో పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ బీమా పథకాన్ని సింగిల్‌ ప్రీమియం చెల్లింపుతో తీసుకోవచ్చు లేదా 12 సంవత్సరాల వ్యవధి వరకు తీసుకోవచ్చు. అలాగే మెచ్యూరిటీ సమయంలో ఏకమొత్తాన్ని లేదా ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత చెల్లింపు పొందే వెసులుబాటును ఎంచుకోవచ్చు.

Infosys Fresher Jobs: ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్స్‌కి 55,000 ఉద్యోగాలు... 12 వారాల ట్రైనింగ్

మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు లైఫ్‌ ఇన్సూరెన్స్ కొనసాగేలా ఈ కొత్త గ్యారెంటెడ్​ గోల్ ప్లాన్​నురూపొందించారు. పాలసీదారుడికి అనుకోని మరణం సంభవించినా లేదా తీవ్రమైన అనారోగ్యాలను గుర్తించినా ప్రీమియం రద్దు ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.అలాగే ఇందులో యాక్సిడెంట్‌ డెత్‌, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఆప్షన్‌ కూడా ఉంది. అధిక ప్రీమియం చెల్లింపులపై అధిక ప్రయోజనాలను ఈ పథకం పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ గ్యారెంటీడ్‌ గోల్‌ ప్లాన్ అందిస్తుంది.

ALSO READ Ukraine-Russia : ఆ దేశంపై యుద్ధానికి..ఆర్మీలో చేరి శిక్షణ తీసుకుంటున్న 79 ఏళ్ల బామ్మ

ఇందులో లిమిటెడ్‌ పే పాలసీని ఎంచుకొని పాలసీదారుడు మరణించినట్లైతేవార్షిక ప్రీమియానికి 10 రెట్లు ఎక్కువ లేదా పాలసీదారు మరణించే నాటికి చెల్లించిన ప్రీమియంలపై 105% చెల్లించడం జరుగుతుంది. సింగిల్‌ ప్రీమియం విత్‌ సింగిల్‌ లైఫ్ పాలసీలు ఎంచుకుంటే పాలసీదారు మరణం సంభవిస్తే సింగిల్‌ ప్రీమియంపై 1.25 రెట్లు హామీమొత్తంగా చెల్లించడం జరుగుతుంది. హామీ మొత్తం చెల్లింపుతో పాలసీ రద్దవుతుంది. పీఎన్​బీ సింగిల్​ ప్రీమియం ప్లాన్​ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

సింగిల్‌ ప్రీమియం జాయింట్‌ లైఫ్‌ కవర్‌ పాలసీని ఎంచుకుంటే..?

1. పాలసీ వ్యవధిలో పాలసీదారుడికి అనుకోని మరణం సంభవిస్తే..జీవించి ఉన్నమరో పాలసీదారుడుచెల్లించిన సింగిల్‌ ప్రీమియంపై1.25 రెట్లు హామీ మొత్తంగా అందిస్తుంది.

2. జీవించి ఉన్న మరో పాలసీదారు మరణం సంభవిస్తే..చెల్లించిన సింగిల్‌ ప్రీమియంపై 10 రెట్లునామినీకి అందిస్తుంది. పాలసీ రద్దవుతుంది.

ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆదాయ పన్ను చట్టం, 1961లోని నిబంధనలకు అనుగుణంగా పన్నురహిత ప్రయోజనాలతో ఉంటాయి.
Published by:Veera Babu
First published:

Tags: Banks, National banks, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు