FD Rates | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరే స్కీమ్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తాజాగా కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకంలో చేరితే అధిక వడ్డీ రేటు పొందొచ్చు.
పీఎన్బీ తాజాగా 600 రోజుల ఎఫ్డీ స్కీమ్‌ను తెచ్చింది. ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్స్‌కు, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు, సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇది సింగిల్ డిపాజిట్ పథకం. రూ. 2 కోట్ల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. కేలబుల్, నాన్ కేలబుల్ అనేవి ఇవి. కేలబుల్ ఆప్షన్ ఎంచుకుంటే 7 శాతం వడ్డీ వస్తుంది. ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది.
షాకిస్తున్న బంగారం.. నెల రోజుల గరిష్టానికి ధర.. ఈరోజు రేట్లు ఇలా
అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఇంకా సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.8 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది. అలాగే నాన్ కేలబుల్ ఆప్షన్ ఎంచుకుంటే సాధారణ కస్టమర్లకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు 7.85 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. అంటే పీఎన్బీ ఎఫ్డీ స్కీమ్‌పై గరిష్టంగా 7.85 శాతం వరకు వడ్డీని అందిస్తోందని చెప్పుకోవచ్చు.
ఒక్కసారి చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు వెళ్లే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
కస్టమర్ల కోసం బెస్ట్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవో అతుల్ కుమార్ తెలిపారు. ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా పీఎన్బీ వన్ యాప్ ద్వారా ఈ ఎఫ్డీ సేవలు పొందొచ్చు. కాగా పీఎన్బీ అక్టోబర్ 26న ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 6.1 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ లభిస్తుంది. పదేళ్ల వరకు టెన్యూర్‌తో ఈ బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవచ్చు.
అయితే ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు కూడా మారుతుందని గుర్తించుకోవాలి. అందువల్ల డబ్బులు పెట్టడానికి ముందే ఏ టెన్యూర్ ఎంచుకుంటే బాగుంటుందో ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం. ఒక్కసారి డబ్బులు పెట్టిన తర్వాత టెన్యూర్ అయిపోయేంత వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దు. తీసుకుంటే చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Personal Finance, Punjab National Bank