హోమ్ /వార్తలు /బిజినెస్ /

Farmers: రైతుల కోసం స్పెషల్ లోన్ స్కీమ్.. వెంటనే రూ.50 వేలు పొందొచ్చు!

Farmers: రైతుల కోసం స్పెషల్ లోన్ స్కీమ్.. వెంటనే రూ.50 వేలు పొందొచ్చు!

రైతుల కోసం స్పెషల్ స్కీమ్.. వెంటనే రూ.50 వేల రుణం పొందొచ్చు!

రైతుల కోసం స్పెషల్ స్కీమ్.. వెంటనే రూ.50 వేల రుణం పొందొచ్చు!

Punjab National Bank | రైతులకు అలర్ట్. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో ప్రత్యేకమైన స్కీమ్ అందుబాటులో ఉంది. దీని ద్వారా అన్నదాతలకు వెంటనే రూ. 50 వేల రుణం లభిస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  PNB Loan | రైతులకు తీపికబురు. అన్నదాతలు (Farmers) సులభంగానే వెంటనే రుణం పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నదాతల కోసం ప్రత్యేకమైన స్కీమ్‌ను అందిస్తోంది. దీని పేరు పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ రిన్ యోజన. ఈ పథకం కింద అన్నదాతలు వెంటనే రుణం పొందొచ్చు. రూ. 50 వేల వరకు లోన్ (Loan) లభిస్తుంది. రైతులు ఎలాంటి తనఖా లేకుండానే ఈ తరహా రుణాలు సులభంగా పొందొచ్చు.

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) అందిస్తున్న ఈ స్కీమ్ కింద రైతన్నలకు రుణ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతుంది. పీఎన్‌బీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రైతులు వారి ఆర్థిక అవసరాల కోసం బ్యాంక్ నుంచి లోన్ పొందొచ్చని, కిసాన్ తత్కాల్ లోన్ స్కీమ్ అందుబాటులో దని ట్వీట్ చేసింది. గరిష్టంగా రూ.50 వేల వరకు రుణం పొందొచ్చని తెలిపింది. ఎలాంటి గ్యారంటీ అవసరం లేదని తెలిపింది. కనీస డాక్యుమెంట్ల ద్వారా రుణం పొందొచ్చని బ్యాంక్ పేర్కొంది.

  ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. 5 ఏళ్ల తర్వాత ఈ బ్యాంక్ కస్టమర్లకు భారీ ఊరట!

  हर किसान की जरूरतें पूरी करने के लिए पीएनबी लाया हैं किसान तत्काल ऋण योजना।#kisan #kisantatkal #AzadiKaAmritMoahotsav #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/FWM1X5XUQP

  రైతులు ఏ అవసరానికి అయినా సరే బ్యాంక్ నుంచి ఈ స్కీమ్ కింద లోన్ తీసుకోవచ్చని పీఎన్‌బీ తెలిపింది. రైతులకు సాయం చేసేందుకు కిసాన్ తత్కాల్ స్కీమ్ ఉంటుందని పేర్కొంది. ఈ స్కీమ్ కింద లోన్ పొందాలని భావించే రైతులు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. వ్యవయసా భూమి కలిగి ఉండాలి. లేదంటే కౌలుకు చేస్తున్నా కూడా లోన్ పొందొచ్చు. రైతులు లేదా రైతు సమూహాలకు మాత్రమే లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది.

  బ్యాంక్ చౌక బేరం.. తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ కొనేయండి!

  అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులు కూడా బ్యాంక్ నుంచి ఈ స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. అయితే రైతులు గత రెండేళ్లుగా బ్యాంక్ రికార్డులను కరెక్ట్‌గా కలిగి ఉండాలి. అంటే తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తూ వచ్చి ఉండాలి. ప్రస్తుత లోన్ లిమిట్‌లో 25 శాతం వరకు లేదా గరిష్టంగా రూ. 50 వేల వరకు రుణం పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని ఐదేళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కాగా అర్హత కలిగిన రైతులు దగ్గరిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఈ పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ లోన్ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకొని రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank loan, Banks, Farmers, Punjab National Bank

  ఉత్తమ కథలు