ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి నివారణ చర్యలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే బ్యాంకులు లోన్లు, డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అనేక బ్యాంకులు ఇటీవల వరుసగా రెండుసార్లు ఎఫ్డీ(FD) రేట్లను పెంచాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యంక్(PNB), ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఎంసీఎల్ఆర్ అనేది రుణదాతలు రుణం ఇవ్వడానికి అనుమతించని దిగువ బెంచ్‌మార్క్ రేటు. అంతకంటే దిగువ రేటుతో రుణాలు ఇవ్వకూడదు. ఈ రేట్లు డిసెంబరు 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించాయి.
వేటిపై ప్రభావం పడుతుందంటే?
బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ని పెంచడంతో ఆ ప్రభావం హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్‌పై కనిపిస్తుంది. దీంతో వీటికి సంబంధించిన నెలవారీ వాయిదాలు (EMI) పెరిగే అవకాశాలు ఉంటాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం టెన్యూర్ ఉన్న ఎంసీఎల్ఆర్ని 20 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని ద్వారా ఈ సంవత్సరం ఎంసీఎల్ఆర్ 7.95 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఇది మినహా మిగిలిన అన్ని టెన్యూర్లకు MCLRని 25 బేస్ పాయింట్లు పెంచింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.65 శాతం నుంచి 7.90 శాతానికి పెరిగింది. దీని ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల, మూడు సంవత్సరాల MCLRలు కూడా 25 బేసిస్ పాయింట్ల చెప్పున పెరిగాయి. దీంతో ఓవర్‌నైట్ 7.30 శాతం, ఒకనెల 7.65 శాతం, మూడు నెలలు 7.70 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి చేరుకున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 బేసిస్ పాయింట్లు(bps) పెంచింది. వంద బేసిస్ పాయింట్లు ఒక శాతం పాయింట్‌కి సమానం. ఈ పెంపుతో దాని ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.05 నుంచి 8.10 శాతానికి పెరిగింది. ఆరు నెలల ఎంసీఆర్ 7.75 శాతం నుంచి 7.80 శాతానికి పెరిగింది. ఈ పెంపు అన్ని టెన్యూర్లకు వర్తిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్
ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన ఎంసీఎల్ఆర్ని అన్ని టెన్యూర్లలో 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీని ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.05 శాతం నుండి 8.15 శాతానికి చేరింది. ఆరు నెలల, ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్లు కూడా 10 బేసిస్ పాయింట్లు 8.35 శాతం, 8.40 శాతానికి చేరాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.35 శాతానికి పెరిగింది.
మూడు నెలల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యోల్బనాన్ని నియంత్రించడానికి 2022 మే నుంచి వరుసగా నాలుగుసార్లు రెపో రేటును 190 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతూ వచ్చింది. ఆర్బీఐ తదుపరి ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఈ డిసెంబర్ 5-7 తేదీల్లో జరగనుంది. అక్టోబర్‌లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠ స్థాయి 6.77 శాతానికి తగ్గింది. 2022 అక్టోబర్‌లో రూరల్ ఏరియాల్లో ద్రవ్యోల్బణం 6.98 శాతానికి తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో 6.50 శాతానికి తగ్గింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EMI, Icici, Punjab National Bank