హోమ్ /వార్తలు /బిజినెస్ /

PNB Housing Unnati home loan: 90 శాతం హోమ్ లోన్ ఇస్తామని ప్రకటించిన పీఎన్‌బీ హౌసింగ్

PNB Housing Unnati home loan: 90 శాతం హోమ్ లోన్ ఇస్తామని ప్రకటించిన పీఎన్‌బీ హౌసింగ్

ఏప్రిల్ 23, 2021: ఈ రోజు శనివారం. ఇల్లు కొనేందుకు మంచి ముహూర్తం ఉదయం 05:48 నుంచి 9:50 మధ్యలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

ఏప్రిల్ 23, 2021: ఈ రోజు శనివారం. ఇల్లు కొనేందుకు మంచి ముహూర్తం ఉదయం 05:48 నుంచి 9:50 మధ్యలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

PNB Housing Unnati home loan | ప్రాపర్టీ వ్యాల్యూపై 90 శాతం హోమ్ లోన్ ఇచ్చేందుకు ఉన్నతి హోమ్ లోన్ ఆఫర్ ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ.

  హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ అద్భుతమైన హోమ్ లోన్ ఆఫర్ ప్రకటించింది. ప్రాపర్టీ వ్యాల్యూలో 90 శాతం హోమ్ లోన్ ఇస్తామని తెలిపింది. ప్రధాన మంత్రి 'హౌజింగ్ ఫర్ ఆల్' మిషన్‌లో భాగంగా 'ఉన్నతి హోమ్ లోన్' పేరుతో ఈ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులకు ఈ ఆఫర్ ప్రకటించింది. గరిష్టంగా రూ.35 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. టైర్ 1 సిటీస్‌లో కనీసం రూ.8 లక్షల లోన్ తీసుకోవచ్చు. ఉద్యోగులు మాత్రమే కాదు ఉపాధి పొందుతున్నవారు కూడా ఈ హోమ్ లోన్ తీసుకోవచ్చు. చిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజల కోసం ఈ ఆఫర్ ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్.

  SBI ATM: అలర్ట్... ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసా?

  Gold Price: పెళ్లిళ్ల సీజన్‌కు ముందు గుడ్ న్యూస్... బంగారం ధర ఎంత తగ్గిందంటే

  సాధారణంగా బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ప్రాపర్టీ వ్యాల్యూలో 80 శాతం మాత్రమే రుణాలు ఇస్తుంటాయి. కానీ 90 శాతం రుణాలు ఇస్తామని ప్రకటించి ఇతర బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సవాల్ విసిరింది పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్. రూ.40,00,000 ప్రాపర్టీని ఎంచుకుంటే రూ.35,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. అంటే కస్టమర్లు చెల్లించాల్సిన డౌన్‌పేమెంట్ రూ.5,00,000 మాత్రమే. డౌన్‌పేమెంట్ తక్కువగా ఉన్నప్పుడు హోమ్ లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపించేవారు ఎక్కువ. టైర్ 1 నగరాల్లో కనీసం రూ.8,00,000, టైర్ 2 పట్టణాల్లోకనీసం రూ.6,00,000 లోన్ తీసుకోవచ్చు.

  SBI Personal Loan: కేవలం 4 క్లిక్స్‌తో రూ.20 లక్షల లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ... అప్లై చేయండి ఇలా

  EPF Account Update: ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ మార్చండి చేయండి ఇలా

  కనీసం 225 స్క్వేర్ ఫీట్ లేదా 40 చదరపు గజాల్లో నిర్మాణాలు చేసేవారికి ఈ లోన్ ఆఫర్ వర్తిస్తుంది. వడ్డీ 10.75 శాతం నుంచి వర్తిస్తుంది. కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేటు మారుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ 'ఉన్నతి హోమ్ లోన్' కింద హోమ్ లోన్ తీసుకున్నవారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌కు కూడా దరఖాస్తు చేయొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank loans, Home loan, Housing Loans, Personal Finance

  ఉత్తమ కథలు