Home Loan Rates | ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన పీఎన్బీ (PNB) హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. రోష్ని పేరుతో ఈ పథకాన్ని తెచ్చింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన వారు సులభంగానే రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా హోమ్ లోన్ (Home Loan) పొందొచ్చు. టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో ఈ స్కీమ్ అమలులో ఉండనుంది. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ ఇటీవలనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్రాంచ్ ఆఫీస్‌లను కూడా ప్రారంభించింది. చెన్నై, కోయంబత్తూరు, ఘజియాబాద్, హైదరాబాద్ , ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పుణే, రాజ్‌కోట్, వారణాసిలో వీటిని ఏర్పాటు చేసింది. అంటే ఈ స్కీమ్ ఈ ప్రాంతాల్లో అందుబాటులో ఉండనుంది. సెల్ఫ్ బిల్డింగ్, ఇంటి మర్రమత్తులు లేదా విస్తరణ, ప్రాపర్టీ తనఖా, ప్రాపర్టీ కొనుగోలు ఇలా పలు రకాల అవసరాలకు మీరు రుణం పొందొచ్చు.
వాహనదారులకు అలర్ట్.. ఈ రూల్స్ మారాయి, ఉల్లంఘిస్తే రూ.2 వేలు జరిమానా!
తొలి సారి లోన్ తీసుకునే వారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, రూ.10 వేల నుంచి కనీస కుటుంబ ఆదాయం కలిగిన వేతన జీవులు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్‌కు చెందిన వారు ఈ రోష్ని స్కీమ్ కింద లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆఫర్డబుల్ హౌసింగ్ విభాగంలో అధిక మార్కెట్ వాటా లక్ష్యంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ముందుకు వెళ్తోందని చెప్పుకోవచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క రూపాయి ఆఫర్ అదిరింది!
టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో సర్వీసులు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాల్లో సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని, కస్టమర్లకు దగ్గరగా ఉంటామని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో గిరీశ్ కౌస్గి తెలిపారు. రోష్ని ద్వారా సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసుకోవడంలో తోడ్పాటు అందిస్తామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హౌసింగ్ ఫర్ ఆల్ అనే మిషన్ పాటుగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుదలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
కాగా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా కస్టమర్లకు హోమ్ లోన్స్ అందిస్తోంది. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. దేశ వ్యాప్తంగా బ్రాంచ్ నెట్వర్క్ కలిగి ఉంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 15 రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించాలని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రణాళికలు నిర్దేశించుకుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వద్ద పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నమోదు అయ్యి ఉంది. 1988లో ఇది కార్యకలాపాలు ప్రారంభించింది. హోమ్ లోన్స్ అందిస్తూ వస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Home loans, Interest rates, Punjab National Bank