FD Rates | మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. రిస్క్ లేకుండానే మీరు మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. బ్యాంకులు (Banks) ఈ అవకాశం కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ – PNB) కస్టమర్లకు ఈ అవకాశం కల్పిస్తోంది. డబ్బులు దాచుకునే వారికి అదిరే బెనిఫిట్ కల్పిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదిరే రాబడి ఆఫర్ చేస్తోంది. మీరు బ్యాంక్‌లో డబ్బులు ఎఫ్‌డీ చేస్తే.. రిస్క్ లేకుండానే డబ్బులను రెట్టింపు చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 180 రోజుల నుంచి 270 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6 శాతం వరకు వడ్డీని అందుబాటులో ఉంచింది. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.3 శాతం వడ్డీ పొందొచ్చు.
బంగారం కొనాలనుకుంటున్నారా? ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్, కేంద్రం కీలక ప్రకటన!
666 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. ఇంకా రెండేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.3 శాతంగా ఉంది. అలాగే మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 7.5 శాతంగా కొనసాగుతోంది. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం దాకా వడ్డీ పొందొచ్చు. పదేళ్ల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 7.3 శాతంగా కొనసాగుతోంది. అంతేకాకుండా ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై అయితే పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు.
ఒక్కసారి చార్జ్ చేస్తే 330 కి.మి వెళ్లొచ్చు.. దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
ఉదాహరణకు మీరు పీఎన్‌బీలో పదేళ్ల టెన్యూర్‌తో రూ. 10 లక్షలు డిపాజిట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు ఎఫ్‌డీ రేటు ప్రకారం చూస్తే.. పదేళ్ల కాలంలో మీ డబ్బు రూ. 20 లక్షలకు పైగా పెరుగుతుంది. అంటే మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ. 20 లక్షలకు పైగా వస్తాయి. రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు.
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల కీలక రెపో రేటును పెంచేసింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి ఎగసింది. ఈ క్రమంలో బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేశాయి. దీని వల్ల ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మీకు లభించే వడ్డీ రేటు కూడా మారుతుంది. అందుకే డబ్బులు దాచుకునేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Money, Personal Finance, Punjab National Bank