PNB: భారతదేశం ఇప్పుడు డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల వినియోగం పెరిగింది. క్షణాల్లో మనీ ట్రాన్సాక్షన్‌లు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాప్‌లలో కూడా ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నా.. యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొంచెం కష్టతరంగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు, తమ కస్టమర్లకు మరింత సులువుగా సేవలు అందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab national bank) ముందుకొచ్చింది. PNB ONE బ్యాంకింగ్ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సులభతరం చేసింది. ఆధార్ కార్డు డీటైల్స్ ఇచ్చి OTP బేస్డ్ అథెంటికేషన్ ద్వారా ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు. ఆధార్ OTP అథెంటికేషన్‌తో రిజిస్ట్రేషన్ తీసుకొచ్చిన మొదటి బ్యాంక్‌గా PNB నిలిచింది.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్
ఈ PNB ONE యాప్‌లో రిజిస్టర్ అవ్వాలనుకున్న యూజర్లు తమ ఆధార్ కార్డు నంబరు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కి వచ్చిన OTP ఎంటర్ చేయాలి. ఆధార్ OTP అథెంటికేషన్ ప్రాసెస్‌కి కచ్చితంగా ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. యాప్‌లో యూజర్ తన ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయగానే.. రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది . ఈ OTP కొద్దిసేపు వరకు వ్యాలిడ్‌గా ఉంటుంది. ఆధార్ OTP అథెంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్‌తో పాటు యూజర్‌ని ఎనేబుల్ చేయడానికి, పిన్ రీసెట్ చేసుకోవడానికి, లిమిట్స్ సెట్ చేయడం వంటికి కూడా చేయవచ్చు. ఆధార్ కార్డుతో PNB ONE యాప్‌లోకి లాగిన్ అయిన కస్టమర్లు యాప్‌లో ఉన్న ఇతర ఫీచర్లని కూడా వాడుకోవచ్చు. వీటిలో స్కాన్ అండ్ పే, అకౌంట్ స్టేట్‌మెంట్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, కార్డ్ లెస్ విత్ డ్రా, ప్రీ-అప్రూవల్ పర్సనల్ లోన్స్, ఫ్రీ క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్స్, IPO సర్వీసెస్ వంటి ఫీచర్స్ వినియోగించుకోవచ్చు.
Twitter: హ్యాకర్ల చేతిలో 400 మిలియన్ యూజర్ల ట్విట్టర్ డేటా?ప్రూఫ్‌గా సల్మాన్ ఖాన్, సుందర్ పిచాయ్ వివరాల వెల్లడి!
కస్టమర్స్‌కి సౌకర్యంగా ఉంటుంది
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో అతుల్ కుమార్ గోయల్ మాట్లాడుతూ.. ఈ కొత్త రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా యాప్‌లో రిజిస్ట్రేషన్ కోసం డెబిట్ కార్డ్‌పై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు. PNB ONE యాప్ కస్టమర్లకు సులువుగా ట్రాన్సాక్షన్‌లు చేసే సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. డెబిట్ కార్డు లేని వారు కూడా ఆధార్ OTP అథెంటికేషన్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వవచ్చని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా వేగంగా సర్వీస్ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు ఈ కొత్త ఆధార్ OTP అథెంటికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌తో దేశవ్యాప్తంగా PNB వివిధ రకాల సర్వీసులు అందిస్తోందని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AADHAR, Punjab National Bank