హోమ్ /వార్తలు /బిజినెస్ /

Banks: ఖాతాదారులకు బంపర్ గిఫ్ట్.. ఈ 2 బ్యాంకుల కీలక నిర్ణయం!

Banks: ఖాతాదారులకు బంపర్ గిఫ్ట్.. ఈ 2 బ్యాంకుల కీలక నిర్ణయం!

Fixed Deposits

Fixed Deposits

Fixed Deposit | బ్యాంకులు కస్టమర్లకు తీపికబురు అందించాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీని వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి అధిక ప్రయోజనం కలుగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Fd Rates | బ్యాంకులు వరుసపెట్టి కస్టమర్లకు తీపికబురు అందిస్తూ వస్తున్నాయి. తాజాగా మరో రెండు బ్యాంకులు (Banks) కూడా ఈ జాబితాలో చేరాయి. ప్రభుత్వ రంగానికి చెందిన రెండు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed Deposit) వడ్డీ రేట్లను పెంచేశాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇకపై అధిక రాబడి లభించే అవకాశం ఉంటుంది.

    ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సెప్టెంబర్ 13 నుంచే రేట్ల పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. వీరికి ఇకపై ఈ బ్యాంక్‌లో అధిక వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 6.6 శాతం వరకు, సూపర్ సీనియర్ సీనిజన్స్‌కు అయితే 6.9 శాతం వరకు వడ్డీ వస్తుంది.

    కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. ఈరోజు నుంచి..

    పీఎన్‌బీలో సాధారణ కస్టమర్లకు ఎలాంటి వడ్డీ రేట్లు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 3 శాతం నుంచి 4.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 5.5 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అలాగే 405 రోజుల ఎఫ్‌డీలపై 6.1 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీలపై 5.6 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై 5.75 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.65 శాతం వడ్డీ వస్తోంది. 1111 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది.

    ఎయిర్ ఇండియాకు కొత్త పేరు.. అదిరిపోయిందిగా..

    అలాగే మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లు పెంచేసింది. సెప్టెంబర్ 10 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ కస్టమర్లకు 2.75 శాతం నుంచి 5.6 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఏడాదిలోపు ఎఫ్‌డీలపై అయితే 4.75 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలు అయితే 5.45 శాతం వడ్డీ పొందొచ్చు. రెండేళ్ల నుంచి ఐదేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై 5.6 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. కాగా రేట్ల పెంపు వల్ల బ్యాంక్ పాత కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కొత్తగా బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికే కొత్త రేట్లు వర్తిస్తాయి. లేదంటే పాత ఎఫ్‌డీలను రెన్యూవల్ చేసుకుంటే అప్పుడు కొత్త వడ్డీ రేటు వర్తిస్తుంది.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Bank, FD rates, Fixed deposits, Money, Personal Finance

    ఉత్తమ కథలు