Punjab National Bank | బ్యాంకులు వరుసపెట్టి కస్టమర్లకు షాకిస్తున్నాయి. తాజాగా మరో రెండు బ్యాంకులు (Banks) కస్టమర్లకు ఝలక్ ఇచ్చాయి. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయా బ్యాంకుల నుంచి లోన్ (Loan) తీసుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్ రంగానికి చెందిన బంధన్ బ్యాంక్ తాజాగా రుణ రేట్లు పెంచేశాయి.
బ్యాంకుల రుణ రేట్ల పెంపు నేపథ్యంలో పీఎన్‌బీ, బంధన్ బ్యాంక్ లోన్ తీసుకున్న వారిపై ఎఫెక్ట్ పడనుంది. నెలవారీ ఈఎంఐ పైకి చేరనున్నాయి. అంతేకాకుండా కొత్తగా లోన్ తీసుకోవాలని భావించే వారిపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. రుణ రేట్లు పెరగడం వల్ల అధిక వడ్డీకి లోన్ పొందాల్సి వస్తుంది. గతంలో కన్నా వడ్డీ భారం పెరుగుతుంది. ఇలా ఇరువురిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చ.
జస్ట్ రూ.7తో 100 కి.మి వెళ్లండి.. ఈ ఇ-బైక్ అదరహో, రూ.999తో బుక్ చేసుకోవచ్చు!
బంధన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. రుణ రేట్ల పెంపు నిర్ణయం ఫిబ్రవరి 28 నుంచి అమలులోకి వచ్చింది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 6.71 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ కూడా 6.71 శాతంగానే ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.21 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.21 శాతానికి చేరింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 10.96 శాతంగా ఉంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా ఇదే స్థాయిలో ఉంది.
సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర! కొత్త రేట్లు ఇలా
మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రుణ రేట్లు పెంచేసింది. ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పైకి చేరింది. బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 8.4 శాతం నుంచి 8.5 శాతానికి పెంచింది. పంజాబ్ నేషలన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెంపు నిర్ణయం మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది. అంటే ఈ రోజు నుంచే కొత్త రుణ రేట్లు అమలులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ రెపో రేటు పెంచడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. బ్యాంకులు అన్నీ కూడా రుణ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి.
ఇప్పటికే దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి దిగ్గజ బ్యాంకులు కూడా కూడా రుణ రేట్లు పెంచేశాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. బ్యాంకులు అన్నీ రుణ రేట్లు పెంచడం వల్ల లోన్ తీసుకోవాలని భావించే వారిపై ప్రభావం ఉంటుంది. ఎక్కువ రుణ రేటుతో లోన్స్ పొందాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Bank news, EMI, Home loan, Mclr, Punjab National Bank