PMSBY SCHEME BENEFITS PRADHAN MANTRI SURAKSHA BIMA YOJANA SCHEME OFFERS RS 2 LAKH ACCIDENTAL INSURANCE WITH RS 12 PREMIUM PER YEAR KNOW THIS SCHEME DETAILS SS
Govt Scheme: జస్ట్ రూ.12 చెల్లించండి... రూ.2,00,000 ప్రయోజనం పొందండి
Govt Scheme: జస్ట్ రూ.12 చెల్లించండి... రూ.2,00,000 ప్రయోజనం పొందండి
(ప్రతీకాత్మక చిత్రం)
Govt Scheme | కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ పథకంలో కేవలం ఏడాదికి రూ.12 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల ప్రయోజనాలు (Rs 2,00,000 Benefits) పొందొచ్చు. ఇప్పటికే ఈ స్కీమ్‌లో 28 కోట్లకు పైగా ప్రజలు చేరారు.
కేంద్ర ప్రభుత్వం పౌరుల కోసం అనేక ప్రభుత్వ పథకాలను (Govt Schemes) అందిస్తూ ఉంటుంది. అలాంటి పథకాల గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల వాటి ప్రయోజనాలను పొందలేకపోతుంటారు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ఓ పథకంలో చేరినవారు ఏడాదికి కేవలం రూ.12 చెల్లిస్తే రూ.2,00,000 ప్రమాద బీమా ప్రయోజనాలు లభిస్తాయి. ఆ పథకం పేరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). 2015లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకంతో పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ కూడా ప్రారంభమైంది. పేదలు, తక్కువ ఆదాయం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇన్స్యూరెన్స్ ప్రయోజనాలు అందించాలన్న లక్ష్యంతో తక్కువ ప్రీమియంతో ఈ ఇన్స్యూరెన్స్ పథకాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లిస్తే రూ.2,00,000 బీమా లభిస్తుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్‌లో ఏడాదికి రూ.12 చెల్లిస్తే రూ.2,00,000 ప్రమాద బీమా లభిస్తుంది. ఇంత తక్కువ ప్రీమియంతో ఏ ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు బీమా ప్రయోజనాలు అందించట్లేదు.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 2022 ఏప్రిల్ 27 నాటికి 28.37 కోట్ల మంది చేరారు. 97,227 క్లెయిమ్స్ సెటిల్ కాగా రూ.1,930 కోట్లు చెల్లించింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌లో ఉన్నవారు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే వారి నామినీకి రూ.2,00,000 ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది ప్రభుత్వం. ఒకవేళ పాక్షికంగా వైకల్యానికి గురైతే రూ.1,00,000 ఆర్థిక సాయం అందిస్తుంది.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కేవలం యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ మాత్రమే. ప్రమాదంలో మరణించినా, వైకల్యానికి గురైనా ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. సహజ మరణాలకు వర్తించదు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారంతా ఈ స్కీమ్‌లో సులువుగా చేరొచ్చు. ప్రతీ బ్యాంకులో ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
SBI: ఎస్బీఐ నుంచి రూ.9,00,000 ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు... వారమే గడువు
ఈ స్కీమ్‌లో చేరినవారు ప్రతీ ఏటా రూ.12 ప్రీమియం చెల్లించాలి. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే ఇన్స్యూరెన్స్ ఒక ఏడాది వరకు మాత్రమే ఉంటుంది. ప్రతీ ఏడాది మే 25 నుంచి మే 31 మధ్య ప్రీమియం చెల్లిస్తే తర్వాతి ఏడాదికి రెన్యువల్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ఆటోడెబిట్ ఆప్షన్ ద్వారా ప్రీమియం డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి.
కాబట్టి ఇప్పటికే మీరు ఈ స్కీమ్‌లో ఉన్నట్టైతే మీ బ్యాంక్ అకౌంట్లో రూ.12 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. కొత్తగా ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంకులో సంప్రదించాలి. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ స్కీమ్‌లో చేరడం సులువే.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.