హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా?

Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా?

Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Pradhan Mantri Jan Dhan Yojana Scheme | ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా ఉన్నవారికి ఇన్స్యూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఏఏ ఇన్స్యూరెన్స్‌లు ఉంటాయో, వాటిని పొందడానికి అర్హతలేంటో తెలుసుకోండి.

మీకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉందా? ఈ అకౌంట్‌తో వచ్చే లాభాల గురించి మీకు తెలుసా? భారతదేశంలో పౌరులందరికీ, కుటుంబంలో కనీసం ఒకరికైనా బ్యాంకు అకౌంట్ ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా పౌరులకు జన్ ధన్ ఖాతాలున్నాయి. కనీస బ్యాలెన్స్ అవసరం లేకపోవడం, రుపే డెబిట్ కార్డ్, రూ.1 లక్ష వరకు ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభించడం ఈ స్కీమ్‌లోని హైలైట్స్. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ మాత్రమే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే దీంతో పాటు లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా ఉంటుంది. అయితే జీవిత బీమా కవరేజీ అందరికి లభించదు. కొందరు మాత్రమే ఈ కవరేజీ పొందొచ్చు.

Post Office Savings Account: ప్రభుత్వ సబ్సిడీలు కావాలంటే ఇలా చేయండి

PAN-Aadhaar: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సేఫేనా? ఇలా దాచుకోండి

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన మొదట్లో అకౌంట్ ఓపెన్ చేసినవారికి మాత్రమే లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ ఉంది. 2014 ఆగస్ట్ 15 నుంచి 2015 జనవరి 26 మధ్య రూపే కార్డుతో ఎవరైతే ప్రధాన మంత్రి జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేశారో వారికి లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. 2015 జనవరి 26 నుంచి వారికి రూ.30,000 లైఫ్ కవర్ వర్తిస్తుంది. కుటుంబ యజమానికి మాత్రమే ఈ రిస్క్ కవర్ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టైతే ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌కు మాత్రమై లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. అకౌంట్ హోల్డర్ దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీకి రూ.30,000 ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయి.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకంలో భాగంగా లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ పొందాలంటే సదరు ఖాతాదారులు రూపే డెబిట్ కార్డ్ ఉపయోగిస్తూ ఉండాలి. రూపే డెబిట్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. కవరేజీ సమయంలో రూపే డెబిట్ కార్డు యాక్టీవ్‌లో ఉండాలి. ఒకే కుటుంబంలో వేర్వేరు జన్ ధన్ ఖాతాలు, వేర్వేరు రూపే డెబిట్ కార్డులు ఉన్నా కేవలం ఒకరికి మాత్రమే రూ.30,000 జీవిత బీమా వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు ప్రతీ ఏటా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నవారికి, ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు.

First published:

Tags: Insurance, Personal Finance, Pradhan Mantri Jan Dhan Yojana

ఉత్తమ కథలు