ఈ నెల 5న Virtual Global Investor Roundtable సదస్సు ప్రారంభించనున్న ప్రధాని మోదీ..హాజరు కానున్న ముఖేష్ అంబానీ

ఈ సదస్సులో ప్రముఖ ప్రపంచ స్థాయి సంస్థాగత మదుపుదారులు, ప్రముఖ భారత పారిశ్రామిక వేత్తలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రతన్ టాటా, నందన్ నీలేకని, దీపక్ పారేఖ్ హాజరు కానున్నారు.

news18-telugu
Updated: November 3, 2020, 7:41 PM IST
ఈ నెల 5న Virtual Global Investor Roundtable సదస్సు ప్రారంభించనున్న ప్రధాని మోదీ..హాజరు కానున్న ముఖేష్ అంబానీ
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భారత దేశం మరో అద్భుతమైన ప్రపంచ స్థాయి సదస్సుకు వేదిక కానుంది. వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ (Virtual Global Investor Roundtable)VGIR సదస్సును ఈ నెల 5 న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత ప్రారంభించనున్నారు. విజిఐఆర్ ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం అలాగే National Investment and Infrastructure Fund సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో ప్రముఖ ప్రపంచ స్థాయి సంస్థాగత మదుపుదారులు, ప్రముఖ భారత పారిశ్రామిక వేత్తలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రతన్ టాటా, నందన్ నీలేకని, దీపక్ పారేఖ్ హాజరు కానున్నారు. అలాగే భారత ప్రభుత్వం, ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేటర్ల మధ్య ఈ సదస్సులో ప్రత్యేకమైన సంభాషణ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బిఐ గవర్నర్, ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

ఈ రౌండ్ టేబుల్ ప్రపంచంలోని అతిపెద్ద పెన్షన్, సావరిన్ వెల్త్ ఫండ్స్ సంస్థలు సుమారు ఇరవై పాల్గొననున్నాయి. వీటి ఆధీనంలో సుమారు US $ 6 ట్రిలియన్ల ఫండ్స్ ఉన్నాయి. ఈ ప్రపంచ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఎక్కువ భాగం యుఎస్ఏ, యూరప్, కెనడా, కొరియా, జపాన్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లతో సహా కీలక ప్రాంతాల నుంచి తరలిరానున్నారు. అలాగే ప్రముఖ సంస్థల CEOలు మరియు CIOల ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఈ తరహాలో భారీ పెట్టుబడిదారులలో భారత ప్రభుత్వం మొదటిసారి ఈ సదస్సు నిర్వహిస్తోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లతో పాటు, రౌండ్ టేబుల్ లో అనేక మంది భారతీయ వ్యాపారవేత్తలు భాగస్వామ్యం కావడం విశేషం.

ఇదిలా ఉంటే VGIR 2020 సదస్సు భారతదేశ ఆర్థిక, పెట్టుబడి దృక్పథం, నిర్మాణాత్మక సంస్కరణలు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మార్గం చూపనుంది. ఇందులో ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రపంచ స్థాయి ఇన్వెస్ట్ మెంట్ సంస్థలకు వివరించనున్నారు. తద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడలను దేశీయ విపణిలోకి తరలి వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఈ కార్యక్రమం ప్రముఖ ప్రపంచ పెట్టుబడిదారులకు భారతీయ వ్యాపార దిగ్గజాలను కలిపే వారధిలా ఉపయోగపడనుంది. అలాగే దేశంలో అంతర్జాతీయ పెట్టుబడుల వృద్ధిని ఎలా వేగవంతం చేయాలనే దానిపై సీనియర్ మేనేజ్ మెంట్ రూపకర్తలతో చర్చించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో అత్యధికంగా నమోదు అయ్యాయి. VGIR 2020 ద్వారా భారత్ లో ప్రపంచ స్థాయి పెట్టుబడి దారులకు బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడనుంది.
Published by: Krishna Adithya
First published: November 3, 2020, 7:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading