చిరు వ్యాపారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకోవడానికి పీఎం స్వనిధి యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10,000 వరకు రుణాలు ఇస్తోంది మోదీ ప్రభుత్వం. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం ఇది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు మొదలుపెట్టేందుకు ఆర్థికంగా సహకారాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారతదేశంలో సుమారు 50 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవడామే పీఎం స్వనిధి యోజన పథకం లక్ష్యం.
Personal Loan: లోన్ ఈజీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి
Savings Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.66 లక్షలు రిటర్న్స్... వివరాలివే
పీఎం స్వనిధి యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ.10,000 వరకు లోన్ తీసుకోవచ్చు. ఒక ఏడాదిలో రుణం తిరిగి చెల్లించాలి. ఈఎంఐల ద్వారా లోన్ చెల్లించొచ్చు. రుణాలు సకాలంలో చెల్లిస్తే 7 శాతం వార్షిక వడ్డీ సబ్సిడీ బ్యాంకు అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ముందుగా రుణాలు చెల్లించిన వారికి ఎలాంటి పెనాల్టీ ఉండదు. డిజిటల్ లావాదేవీలు చేసే చిరు వ్యాపారులకు నెలకు రూ.100 వరకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. చిరు వ్యాపారులు పీఎం స్వనిధి వెబ్‌సైట్ లేదా పీఎం స్వనిధి మొబైల్ యాప్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. మరి మోదీ ప్రభుత్వం అందించే రూ.10,000 లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
Gold Loan: నెలకు 64 పైసల వడ్డీకే బంగారంపై రుణాలు.. కెనెరా బ్యాంక్ ఆఫర్
SBI Balance Check: మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా చెక్ చేయండి ఇలా
ముందుగా https://www.pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోనే అప్లై ఫర్ లోన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. కేటగిరీ సెలెక్ట్ చేసి వివరాలు ఎంటర్ చేయండి. వివరాలన్నీ సరిచూసుకొని సబ్మిట్ చేయండి. మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత రుణాలు మంజూరు చేస్తుంది మోదీ ప్రభుత్వం. ఇప్పటికే 2 లక్షల మందికి పైగా వ్యాపారులు ఈ లోన్ కోసం దరఖాస్తు చేశారు. వారిలో 20 వేల మందికి పైగా చిరు వ్యాపారులకు రుణాలు మంజూరయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Atma Nirbhar Bharat Abhiyan, Atmanirbhar Bharat, Bank loans, Business, Business Ideas, BUSINESS NEWS, Narendra modi, Personal Loan, Pm modi, PM Narendra Modi, Small business