హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension: మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉందా? ఇలా ప్రతి నెలా రూ.3 వేలు పొందండి!

Pension: మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉందా? ఇలా ప్రతి నెలా రూ.3 వేలు పొందండి!

Pension:మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉందా? ఇలా ప్రతి నెలా రూ.3 వేలు పొందండి!

Pension:మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉందా? ఇలా ప్రతి నెలా రూ.3 వేలు పొందండి!

Pension | మీరు ప్రతి నెలా డబ్బులు పొందాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్‌లో చేరితే ఏటా రూ. 30 వేలు పొందొచ్చు. ఎలానో తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Money | మీరు ప్రతి నెలా రూ. 3 వేలు పొందాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. ఇందులో చేరితే ప్రతి నెలా డబ్బులు (Money) పొందొచ్చు. ఆ స్కీమ్ పేరు శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. ఈ స్కీమ్ కింద ఏటా రూ. 30 వేలు లభిస్తాయి. అసంఘటిత రంగంలోని కార్మికులకు మాత్రమే ఈ స్కీమ్ (Scheme) వర్తిస్తుంది. అంటే వీధి వ్యాపారులు, రిక్షా తోలే వారు, తయారీ రంగంలోని కార్మికులు, ఇతర రంగాల్లోని కార్మికులు ఈ స్కీమ్‌లో చేరి ప్రయోజనం పొందొచ్చు.

ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పని పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా మీరు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కేంద్ర ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకమైన పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలని భావించే వారు కచ్చితంగా సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కూడా తప్పనిసరి.

బంగారం కొనాలనుకుంటున్నారా? ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్, కేంద్రం కీలక ప్రకటన!

18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారు ప్రతి నెలా స్వల్ప మొత్తంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. నెలకు రూ. 55 నుంచి చెల్లిస్తే సరిపోతుంది. మీకు 18 ఏళ్ల వయసు ఉండి, నెలకు రూ. 55 చెల్లిస్తే.. మీకు ఏటా రూ. 36 వేలు వస్తాయి. అదే 40 ఏళ్ల వయసులో ఉన్న వరు నెలకు రూ .200 కట్టాల్సి ఉంటుంది. నెలకు రూ. 3 వేలు వస్తాయి.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకుల పని దినాలు, పని వేళల్లో మార్పు?

ఈ స్కీమ్‌లో చేరిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాతి నుంచి ప్రతి నెలా రూ. 3 వేలు లభిస్తాయి. ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారి నెలవారీ ఆదాయం రూ. 15 వేలకు లోపు ఉండాలి. అంతేకాకుండా ఇతర స్కీమ్‌లో ఉండకూడదు. అప్పుడు వీరికి ఆ బెనిఫిట్ లభిస్తుంది. కార్మికులు ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావిస్తే.. దగ్గరిలోని లేబర్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్, ఎల్ఐసీ , ఈపీఎఫ్‌వో కార్యాలయాలకు వెళ్లొచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 1800 267 6888 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచింది. మీరు ఈ నెంబర్‌కు కాల్ చేసి కూడా స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్‌లో చేరి ప్రయోజనం పొందొచ్చు.

First published:

Tags: Aadhaar Card, Bank account, Money, Pensions, Pm modi, Schemes

ఉత్తమ కథలు