హోమ్ /వార్తలు /బిజినెస్ /

Government Scheme: రూ.55 కడితే చాలు.. ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్, వారికి కేంద్రం బంపరాఫర్!

Government Scheme: రూ.55 కడితే చాలు.. ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్, వారికి కేంద్రం బంపరాఫర్!

 Government Scheme: రూ.55 కడితే చాలు.. ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్, వారికి కేంద్రం బంపరాఫర్!

Government Scheme: రూ.55 కడితే చాలు.. ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్, వారికి కేంద్రం బంపరాఫర్!

Shram Yogi Maandhan | నెల నెలా డబ్బులు పొందాలని భావిస్తున్నారా? రూ. 3 వేల పెన్షన్ కోరుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఈ స్కీమ్‌లో చేరితే చాలు. కచ్చితమైన పెన్షన్ సొంతం చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Pension | కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ప్రతి నెలా పెన్షన్ అందించే పథకాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం సంఘటిత రంగంలో పని చేసే వారి కోసం ఒక స్పెషల్ స్కీమ్‌ను (Schemes) అందుబాటులో ఉంచింది. దీని పేరు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెలకు రూ. 15 వేల లోపు ఆదాయం (Money) కలిగిన వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఇందులో చేరడం వల్ల కచ్చితమైన రాబడి సొంతం చేసుకోవచ్చు. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది.

పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకంలో చేరే వారు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. నెలకు రూ. 55 నుంచి కట్టొచ్చు. అయితే ఇక్కడ నెలవారీ మొత్తం మీ వయసు ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. 40 ఏళ్లు దాటితే ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉండదు.

రూ.400 పొదుపుతో రూ.10 లక్షల కారు కొనేయండిలా!

డొమెస్టిక్ వర్కర్లు, స్ట్రీట్ వెండర్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, టైలర్స్, మిడ్ డే మీల్ వర్కర్లు, రిక్షా నడిపే వారు, కన్‌స్ట్రక్షన్ వర్కర్లు, బీడి వర్కర్లు, హ్యాండ్లూమ్ వర్కర్లు, అగ్రికల్చర్ వర్కర్లు, లెదర్ వర్కర్లు ఇలా చాలా మంది ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హత కలిగి ఉన్నారు. స్కీమ్‌లో చేరిన వారికి 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెలా రూ. 3 వేలు పెన్షన్ అందజేస్తారు. స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే.. వారి భాగస్వామికి 50 శాతం పెన్షన్ అందిస్తారు.

లోన్ తీసుకొని బైక్ కొంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్!

18 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ. 55 చెల్లిస్తే సరిపోతుంది. రూ. 3 వేల పెన్షన్ వస్తుంది. ఇలా వయసు ప్రాతిపదికన నెలకు గరిష్టంగా రూ. 200 వరకు చెల్లించాల్సి వస్తుంది. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. నామినీ ఫెసిలిటీ ఉంది. ప్రతి నెలా డబ్బులు మీ అకౌంట్ నుంచి కట్ అయ్యేలా ఆటో డెబిట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి శ్రమ్ యోగి కార్డు అందిస్తారు. అందువల్ల ప్రతి నెలా రూ 3 వేలు పెన్షన్ పొందాలని భావించే వారు ఈ స్కీమ్‌లో వెంటనే చేరిపోవచ్చు.

First published:

Tags: Money, Pensions, Pm modi, Schemes

ఉత్తమ కథలు