ఎకనమిక్ పాలసీపై ప్రధాని మోదీ దృష్టి - ఆర్థికవేత్తల సలహాలు స్వీకరణ

Economic Policy : ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, సవాళ్లపై దేశంలో టాప్ 40 ఆర్థిక వేత్తలతో ప్రధాని మోదీ చర్చించారు. వారి నుంచీ కీలక సలహాలు స్వీకరించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 23, 2019, 8:07 AM IST
ఎకనమిక్ పాలసీపై ప్రధాని మోదీ దృష్టి - ఆర్థికవేత్తల సలహాలు స్వీకరణ
ఆర్థిక వేత్తలతో ప్రధాని నరేంద్రమోదీ (Image : Twitter)
  • Share this:
నీతి ఆయోగ్ అధ్వర్యంలో... ఎకనమిక్ పాలసీ - ది రోడ్ ఎహెడ్ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ... శనివారం రోజంతా ఆర్థిక వేత్తలతో అనేక అంశాలపై చర్చించారు. రెండు పార్టులుగా జరిగిన ఈ సమావేశంలో మొదటి పార్టులో... ఐదు అంశాల్లో నిపుణులైన ఆర్థిక వేత్తలతో సమస్యలపై చర్చించారు. మాక్రో ఎకనమీ, ఉద్యోగాలు, వ్యవసాయం, నీటి వనరులు, ఎగుమతులు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించారు. ఆర్థిక వేత్తలంతా తమ ఫార్ములాలు, సిద్ధాంతాలు, అభిప్రాయాలు, విశ్లేషణలు అన్నింటినీ ప్రధాని ముందు పెట్టారు. ఈ సమావేశంలో కీలక అంశాల్ని జులై 5న లోక్ సభలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో చేర్చబోతున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, శ్రీ రావ్ ఇంద్రజిత్ సింగ్ కూడా హాజరయ్యారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్,... కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌లో సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.


ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్‌లో FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లను అనుమతించడం, పెట్టుబడులను వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చెయ్యడం, నీటి వనరుల్ని సక్రమంగా వినియోగించడం, ఆర్థిక వృద్ధిరేటును పెంచడం వంటి అంశాలపై ప్రధాని మోదీ ఎక్కువ సేపు చర్చించినట్లు తెలిసింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో... మరిన్ని ఉద్యోగాలు సృష్టించడం, ఎగుమతులు పెంచడం, ఆర్థిక వ్యవస్థలో అక్రమాల్ని సరిచెయ్యడం వంటి అంశాలపై మోదీ ఎక్కువగా దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది.ఇవి కూడా చదవండి :

చైనాలో తగ్గుతున్న జనాభా సంఖ్య... 8 ఏళ్లలో చైనాను వెనక్కి నెట్టబోతున్న ఇండియా...


వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?... పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్...

2022లో జమిలి ఎన్నికలు... ఏపీలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా?
Published by: Krishna Kumar N
First published: June 23, 2019, 8:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading