PM NARENDRA MODI TODAY LAUNCHED UJJWALA 2 0 SCHEME HERE FULL DETAILS NS
Ujjwala 2.0: గ్యాస్ సిలిండర్ లేని వారికి మోదీ సర్కార్ శుభవార్త.. కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు.. వివరాలివే
ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
ప్రధాని మోదీ ఉజ్వల 2.0 స్కీంని కొద్ది సేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించనున్నారు.
ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద మరో కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో ఎల్పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ప్లేట్ అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉజ్వల స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రతాలు అవసరం కాగా.. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. New Gas Connection: జస్ట్ ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ బుకింగ్, కొత్త కనెక్షన్.. ఎలానో తెలుసుకోండి
ఈ కార్యక్రమానికి మొత్తం 1000 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. ఇందులో పది మందికి సిలిండర్లను అందించారు. ఈ సందర్భంగా ఉత్తరఖండ్, గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ కు చెందిన ఐదురుగు లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.
"Not wood log stoves, but LPG stoves should be there in every household across the country," said PM Modi during his interaction with women beneficiaries pic.twitter.com/81A2i4drwF
PM Narendra Modi launches Pradhan Mantri Ujjwala Yojana 2.0, hands over LPG connections to several women beneficiaries, at Mahoba via video conferencing. pic.twitter.com/DoPfy2RA1b
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్, కేంద్ర పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు ప్రసాద్ మౌర్యా, దినేష్ శర్మ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉజ్వల 1.0 పథకాన్ని 2016 మే 1న ప్రధాని మోదీ ప్రారంభించారు. మొదటి విడతలో 80 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్లను అందించారు. ఏడు నెలల ముందుగానే మార్చి 2020లో సర్కార్ తన లక్ష్యాన్ని చేరుకుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.