Home /News /business /

PM NARENDRA MODI LAUDS GEM ACHIEVING RS 1 LAKH CRORE ORDER VALUE FULL DETAILS HERE GH VB

PM Modi: రూ. లక్ష కోట్ల ఆర్డర్​ వాల్యూను సాధించిన ఈ–మార్కెట్ ప్లేస్​ పోర్టల్​.. ప్రధాని మోదీ ప్రశంసలు..

మాట్లాడుతున్న ప్రధాని మోదీ (Image : PTI)

మాట్లాడుతున్న ప్రధాని మోదీ (Image : PTI)

చిన్న, మధ్యతరహా వ్యాపారులు తమ బిజినెస్​ను పెంచుకునేందుకు మోదీ సర్కారు నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన గవర్నమెంట్ ఈ–మార్కెట్​ ప్లేస్ (GeM)​ మంచి ఫలితాలను సాధిస్తోంది.

చిన్న, మధ్యతరహా వ్యాపారులు తమ బిజినెస్​ను(Business) పెంచుకునేందుకు మోదీ సర్కారు నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన గవర్నమెంట్ ఈ–మార్కెట్​ ప్లేస్ (GeM)​ మంచి ఫలితాలను సాధిస్తోంది. 2021–22 ఒక్క ఏడాదిలోనే రూ. 1 లక్ష కోట్ల సేకరణను సాధించింది. దీంతో, గవర్నమెంట్(Government) ఈ–-మార్కెట్‌ప్లేస్ (GeM)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ ట్వీట్​ చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) మద్దతిస్తుందని చెప్పారు. ఈ ఏడాది ఈ–మార్కెట్(E Market)​ ప్లేస్​లో జరిగిన మొత్తం ఆర్డర్​ వాల్యూలో(Order Value) చిన్న మధ్య తరగతి సంస్థల వాటానే 57 శాతంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఈ–మార్కెట్​ ప్లేస్​(GeM) అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే వస్తువులు, సేవలను ఎంఎస్​ఎంఈ లేదా ఇతర సంస్థల నుంచి సేకరించేందుకు ఏర్పాటు చేసిన నేషనల్​ పబ్లిక్​ ప్రొక్యూర్​మెంట్ పోర్టల్.

PM Modi: సిక్కు ప్రముఖులు, మేధావులతో భేటీ అయిన ప్రధాని మోదీ.. పలు కీలక అంశాలపై చర్చ..


"ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ (GeM) ఒకే సంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల ఆర్డర్ విలువను సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉంది.  ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. GeM ప్లాట్‌ఫారమ్ ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సాధికారత కల్పిస్తోంది. మొత్తం ఆర్డర్ వాల్యూలో చిన్న, మధ్యతరహా సంస్థల ఆర్డర్​ వాల్యూనే 57 శాతంగా ఉంది.” అని ప్రధాని మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.



చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా..
తాజా డేటా ప్రకారం, 2020–-21 ఆర్థిక సంవత్సరంలో వార్షిక సేకరణ రూ.38580 కోట్లుగా నమోదైంది. ఇక, FY 2019–-20లో ఇది రూ. 22991 కోట్లు, 2018–-19లో సేకరణ రూ.17462 కోట్లు, 2017–-18లో రూ. 6188 కోట్లు,  2016–-17 ఆర్థిక సంవత్సరంలో వార్షిక సేకరణ రూ.422 కోట్లుగా నమోదైంది. ఈ–మార్కెట్​ ప్లేస్​ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ప్లాట్‌ఫామ్‌ల వలే పనిచేస్తుంది. దీన్ని నాలుగేళ్ల క్రితం మోదీ సర్కార్ ప్రారంభించింది. గవర్నమెంట్ ఈ–-మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫామ్​ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజల్స్ (DGS&D) మెయింటైన్ చేస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు గవర్నమెంట్ ఈ–-మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమయ్యాయి. వారికి కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఇక్కడే పొందొచ్చు.

ఇందులో బాల్ పాయింట్ పెన్ నుంచి కంప్యూటర్ వరకు ఏవైనా కొనొచ్చు. హ్యాండ్ శానిటైజర్, మాస్క్ లాంటి మెడికల్ వస్తువులు, హస్తకళలు, చేనేత వస్తువులు, ఫర్నీచర్, స్టేషనరీ లాంటివి కొనొచ్చు. ముఖ్యంగా చిరు వ్యాపారుల చేయూతనిచ్చేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పాటైంది. మీరు వ్యాపారం చేస్తున్నట్టైతే ఈ వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. మీరు అమ్మే వస్తువుల్ని ఈ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయొచ్చు. దీని ద్వారా ప్రభుత్వ శాఖలకు మీ వస్తువులు కావాలంటే ఆర్డర్స్ లభిస్తాయి. మీ బిజినెస్ పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Central Government, Pm modi

తదుపరి వార్తలు