Railways | కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ వాసులకు సంక్రాంతి శుభవార్త తీసుకువచ్చింది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను (Train) ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఈ ట్రైన్ ప్రయాణించనుంది. దీంతో ట్రైన్ (Rail) జర్నీ చేయాలని భావించే వారికి చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన 8వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇది కావడం గమనార్హం. దక్షిణ భారత దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండో వందే భారత్ ట్రైన్ ఇది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్. ఇది దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది.
పండుగ పూట కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. కీలక నిర్ణయం!
ఈ ట్రైన్ విశాఖపట్నం , రాజమండ్రి , విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. అలాగే తెలంగాణలో అయితే ఖమ్మం , వరంగల్, సికింద్రాబాద్‌లో ఆగుతుంది. దీని కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభించింది. అలాగే ప్రభుత్వం ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య కూడా కొత్త వందే భారత్ ట్రైన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.
కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు! ఎప్పటి నుంచంటే..
కాగా ఈ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం వెళ్లడానికి 8 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఈ ట్రైన్ వల్ల ప్రయాణ సమయం దాదాపు 4 గంటలు తగ్గుతుందని చెప్పుకోవచ్చు. విజయవాడకు వెళ్లాలంటే 4 గంటల 20 నిమిషాలు టైమ్ పడుతుంది. ఆదివారం మినహా ప్రతి రోజూ ఈట్రైన్ విశాఖ పట్నం నుంచి ఉదయం 5.45కు ప్రారంభం అవుతుంది. ఈ ట్రైన్ కెపాసిటీ 1100 సీట్లు. ఇప్పటికే దాదాపు 70 శాతం టికెట్లు బుక్ అయ్యాయి. జనవరి 16 ప్రయాణానికి ఇది వర్తిస్తుంది. చెయిర్ కార్ కేటగిరి ధర రూ. 1720గా ఉంది. ఎగ్జిక్యూటివ్ చెయిర్ కాస్ట్ రూ. 3170. ఫుడ్, ట్యాక్సులు కలుపుకొని ఈ ధరలు ఉంటాయి. ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. రెండు ఎగ్జిక్యూటివ్ చెయిర్స్ కోచ్‌లు ఉంటాయి. ఇకపోతే సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ వంటి రాజకీయ నాయకులు, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Pm modi, Railways, Secunderabad trains, Vande Bharat Train