ప్రధాని మోదీ రుచి చూసిన ఈ పుట్టగొడుగు రేటెంతో తెలుసా...ఏకంగా అర తులం బంగారం కొనొచ్చట..

గూచీ మష్రూమ్ అని పిలువబడే ఈ ఖరీదైన పుట్టగొడుగు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఈ పుట్టగొడుగు హిమాలయాల పర్వత ప్రాంతంలో పెరుగుతుంది. ఈ గూచీ పుట్టగొడుగు మార్కెట్లో ఒక కిలో ధర రూ .30,000 పలుకుతోంది.

news18-telugu
Updated: October 21, 2020, 7:39 PM IST
ప్రధాని మోదీ రుచి చూసిన ఈ పుట్టగొడుగు రేటెంతో తెలుసా...ఏకంగా అర తులం బంగారం కొనొచ్చట..
గూచీ మష్రూమ్ అని పిలువబడే ఈ ఖరీదైన పుట్టగొడుగు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఈ పుట్టగొడుగు హిమాలయాల పర్వత ప్రాంతంలో పెరుగుతుంది. ఈ గూచీ పుట్టగొడుగు మార్కెట్లో ఒక కిలో ధర రూ .30,000 పలుకుతోంది.
  • Share this:
భారతదేశంలో ఏదైనా కూరగాయ రేటు కిలోకు 100 రూపాయలకు చేరుకుంటే, అది వార్తల్లో ముఖ్యాంశంగా నిలుస్తుంది. అయితే మనదేశంలో అత్యంత ఖరీదైన ఓ కూరగాయ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. దీన్ని ఒక కిలో కొనుగోలు చేసే ధరతో ఏకంగా అరతులం పైన బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇది పుకారు కాదు, నిజం. అటువంటి పుట్టగొడుగు భారతదేశంలోని హిమాలాయాల్లో లభిస్తుంది. ఇది చాలా అరుదుగా ఉండటం వలన చాలా ఖరీదైనది. అయితే ఇదొక పుట్టుగొడుడు...ఇది అడవుల్లో లభిస్తుంది. గూచీ మష్రూమ్ అని పిలువబడే ఈ ఖరీదైన పుట్టగొడుగు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఈ పుట్టగొడుగు హిమాలయాల పర్వత ప్రాంతంలో పెరుగుతుంది. ఈ గూచీ పుట్టగొడుగు మార్కెట్లో ఒక కిలో ధర రూ .30,000 పలుకుతోంది. ఈ డబ్బుతో మీరు ప్రస్తుత ధరతో సుమారు 6 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

ఖరీదుకు కారణం ఏంటంటే...

ఈ వైల్డ్ మష్రూమ్ను మోరెల్ మష్రూమ్ లేదా మోర్చెల్లా ఎస్కులెంటా అని కూడా పిలుస్తారు. దీని ఖరీదైన ధరకు కారణంగా అరుదుగా లభిచడంతో పాటు, డిమాండ్ ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. దీనిని స్థానిక హిమాలయ ప్రాంతంలో 'గూచి' అని పిలుస్తారు. ఈ విలువైన పుట్టగొడుగులు మెత్తటి తేనెతుట్టె ఆకృతికి చాలా అందంగా ఉంటాయి తినేవారికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది.

ఈ పుట్టగొడుగు ఏ ప్రదేశాల్లో పెరుగుతుంది?
ఈ ప్రత్యేకమైన పుట్టగొడుగును వాణిజ్యపరంగా పండించడం సాధ్యం కాదు. బదులుగా అవి మంచుతో కూడిన కాంగ్రా లోయ, జమ్మూ కాశ్మీర్, మనాలి మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క అటవీ ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. ఈ ప్రత్యేకమైన పుట్టగొడుగు పరీక్షను ప్రధాని నరేంద్ర మోడీ కూడా రుచి చూశారుని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ప్రజలు అడవిలో కనుగొంటారు
కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామస్తులు మార్చి నెలలో అడవి పుట్టగొడుగులను సేకరించే ప్రక్రియను ప్రారంభిస్తారు, ఇది మే చివరి వరకు కొనసాగుతుంది. గ్రామస్తులు ఈ పుట్టగొడుగులను కనుగొనేందుకు చాలా కష్టపడుతుంటారు. వీటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని వెతికేవారి చూపు చాలా చురుగ్గా ఉండాలి. లేకపోతే ఇవి కనిపించకుండా పేయే అవకాశం కూడా ఉంది. ఈ పుట్టగొడుగులు అన్నీ కలిపి ఒకే చోట పెరగవు. ఈ పుట్టగొడుగులు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని అడవి నుంచి సేకరించి మార్కెట్ చేరుకోవడానికి నెలల సమయం పడుతుంది.

ఏ వంటకం సిద్ధం చేస్తారంటే...
మీరు గుచ్చి పుట్టగొడుగులతో చాలా వంటలను తయారు చేయవచ్చు. వాటిలో, గూచీ పులావ్ అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో ఒకటి. గూచీ కా మదారా, గూచీ ముస్సల్లం ఈ ప్రత్యేకమైన పుట్టగొడుగు నుండి తయారుచేసే పేరొందిన వంటకాలు.
Published by: Krishna Adithya
First published: October 21, 2020, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading