Union Budget 2019: ఇన్స్యూరెన్స్ కంపెనీలకు రూ.4,000 కోట్ల సాయం

Union Budget 2019 | నేషనల్ ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు 2019-20 బడ్జెట్‌లో రూ.4,000 కోట్ల సాయం ప్రకటించే అవకాశముంది.

news18-telugu
Updated: June 10, 2019, 12:03 PM IST
Union Budget 2019: ఇన్స్యూరెన్స్ కంపెనీలకు రూ.4,000 కోట్ల సాయం
Union Budget 2019: ఇన్స్యూరెన్స్ కంపెనీలకు రూ.4,000 కోట్ల సాయం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 10, 2019, 12:03 PM IST
పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కసరత్తు చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే బడ్జెట్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది ఆర్థిక శాఖ. జూలై 5న పార్లమెంట్‌లో 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్‌లో అనేక రంగాలకు వరాలు ఉంటాయన్న ఆశలున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సుమారు రూ.4,000 కోట్ల సాయం ప్రకటిస్తారని నిపుణుల అంచనా. మూడు ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను విలీనం చేసే ఆలోచనలో ఉంది కేంద్రం. అంతకంటే ముందే వాటిని బలోపేతం చేసేందుకు రూ.4,000 కోట్ల సాయం ప్రకటించే అవకాశముంది. దాని ద్వారా మూడు ఇన్స్యూరెన్స్ కంపెనీలను విలీనం చేసే ప్రక్రియకు ముందడుగు పడుతుంది.

నేషనల్ ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు 2019-20 బడ్జెట్‌లో రూ.4,000 కోట్ల సాయం ప్రకటించే అవకాశముంది. ప్రభుత్వానికి చెందిన కంపెనీలతో పాటు చాలావరకు జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల నష్టాల్లో ఉన్నాయి. అందుకే నేషనల్ ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలను విలీనం చేసి వాటిని కాపాడుకోవాలని భావిస్తోంది కేంద్రం. 2018-19 బడ్జెట్‌లోనే ఈ ప్రతిపాదన చేసినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మొదట వాటిని ఆర్థికంగా బలోపేతం చేసి ఆ తర్వాత మూడు కంపెనీలను ఒకే సంస్థగా మార్చే ఆలోచనలో ఉంది కేంద్రం. ఈ మూడు కంపెనీల్లో 200 ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ ఉండగా రూ.41,461 కోట్ల ప్రీమియంలను సేకరిస్తోంది. మార్కెట్ షేర్ 35 శాతం ఉండటం విశేషం.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Credit Card: క్రెడిట్ కార్డులో ఈ 5 ఫీచర్లు మీకు తెలుసా?
Loading...
IRCTC: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి
First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...