PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం రైతులకు (Farmers) తీపికబురు అందించింది. పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) కింద తర్వాత విడత డబ్బులు ఎప్పుడు వచ్చేది వెల్లడించింది. దీంతో అన్నదాతలకు నిరీక్షణకు అడ్డుకట్ట పడింది. దీపావళి (Diwali) కన్నా ముందుగానే పీఎం కిసాన్ స్కీమ్ రూ. 2 వేల డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి చేరనుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో 11 విడతల డబ్బును జమ చేసింది. ఇప్పుడు 12వ విడత డబ్బులను అందించేందుకు రెడీగా ఉంది. మోదీ సర్కార్ అక్టోబర్ 17న పీఎం కిసాన్ 12వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. అర్హత కలిగిన రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఈ రూ. 2 వేలు జమ కానున్నాయి.
రూ.6 వేలు పతనమైన బంగారం, వెండి ధరలు.. జస్ట్ 10 రోజుల్లోనే భారీ తగ్గుదల!
అక్టోబర్ 17న ఉదయం 11 గంటలకు పీఎం కిసాన్ స్కీమ్ కింద 12వ విడత డబ్బులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారని సీఎస్సీ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. అంటే ఇంకో రెండు రోజుల్లోనే పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు రైతులకు అందబోతున్నాయి.
ఎస్బీఐ కస్టమర్లకు దీపావళి గిఫ్ట్.. ఈరోజు నుంచి..
PM KISAN INSTALMENTS RELEASE - by Shri Narendra Modi, Hon'ble Prime Minister... MOBILIZATION OF FARMERs THROUGH #CSC FOR LIVE WEBCAST... Date: 17th Oct, 2022 Time: 11:00 AM Webcast link: https://t.co/GfXzqoClAP VLEs must share photos here: https://t.co/ML0Ra2hR6F #PMKisan pic.twitter.com/f4sMmQXeof
— CSCeGov (@CSCegov_) October 14, 2022
కాగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. రైతులకు ఈ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో చేరుతున్నాయి. ఇప్పటి వరకు 11 విడతల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు 12వ విడత డబ్బులు అందాల్సి ఉంది.
అంటే ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.22 వేలు అందించిందని చెప్పుకోవచ్చు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో చేరిన వారు అక్టోబర్ 17న డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్కీమ్‌లో చేరని వారు ఉంటే.. ఇప్పుడైనా చేరొచ్చు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి పథకంలో చేరొచ్చు. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) ద్వారా కూడా పథకంలో చేరే ఛాన్స్ ఉంటుంది. కాగా ఇప్పటికే పీఎం కిసాన్ పథకంలో చేరిన వారు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇకేవైసీ పూర్తి చేసుకోని రైతులకు డబ్బులు రాకపోవచ్చు. అందువల్ల అన్నదాతలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. డబ్బులు పొందాలని భావించే వారు ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Farmers, Money, PM KISAN, PM Kisan Scheme