హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan Scheme: రైతులకు అలర్ట్... వీరికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు

PM Kisan Scheme: రైతులకు అలర్ట్... వీరికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు

PM Kisan Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం రైతుల కోసం రూపొందించినదే అయినా రైతులందరూ ఈ పథకానికి అర్హులు కాదు. ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తించదో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో వివరించింది కేంద్ర ప్రభుత్వం.

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా మద్దతుగా నిలిచేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైతుల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1.57 లక్షల కోట్లకు పైనే రైతుల అకౌంట్లలో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే రైతులందరూ ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకం ఎవరెవరికి వర్తించదో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో వివరించింది ప్రభుత్వం. మరి పీఎం కిసాన్ స్కీమ్ ఎవరికి వర్తించదో తెలుసుకోండి.

  పీఎం కిసాన్ స్కీమ్ వీరికి వర్తించదు

  1. ఇన్‌స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్

  2. రైతుల కుటుంబాల్లో కింద వివరించిన వారు ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే వారికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు.

  Business Idea: రూ.10,000 పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం... రూ.30,000 వరకు ఆదాయం

  i) గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు.

  ii) మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ లోక్‌సభ సభ్యులు, ప్రస్తుత లోక్‌సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్లు, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీ ప్రస్తుత ఛైర్‌పర్సన్స్, మాజీ ఛైర్‌పర్సన్స్.

  iii) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, అధికారులు, స్థానిక సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులకు మినహాయింపు).

  PAN Card: పాన్ కార్డులో ఈ వివరాలు లేవా? అయితే అది నకిలీ కార్డే

  iv) పైన చెప్పిన కేటగిరీలో నెలవారీ పెన్షన్ రూ.10,000 కన్నా ఎక్కువ ఉన్న సూపర్‌యాన్యుయేట్, రిటైర్డ్ పెన్షనర్లు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులకు మినహాయింపు).

  v) గత అసెస్‌మెంట్ ఇయర్‌లో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు.

  vi) ప్రొఫెషనల్ బాడీస్‌లో రిజిస్టర్ అయి ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్.

  రైతుల కుటుంబాల్లో పైన చెప్పినవారు ఎవరు ఉన్నా వారికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు. పీఎం కిసాన్ స్కీమ్ చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. పీఎం కిసాన్ స్కీమ్ 9వ ఇన్‌స్టాల్‌మెంట్ ఇప్పటికే రిలీజ్ అయింది. 10వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

  First published:

  Tags: PM KISAN, PM Kisan Scheme, Pmkisan samman nidhi

  ఉత్తమ కథలు