PM-Kisan Scheme: రైతుల అకౌంట్‌లోకి రూ.2,000, రేపే పీఎం కిసాన్ స్కీమ్ ప్రారంభం

PM-Kisan Scheme | ఒక్కో రైతు అకౌంట్‌లోకి రూ.2,000 చొప్పున మొదటి విడత నగదు బదిలీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్వహించే రైతుల ర్యాలీలో కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో లక్షలాది మందికి నగదు బదిలీ చేయనున్నారు మోదీ.

news18-telugu
Updated: February 23, 2019, 8:27 PM IST
PM-Kisan Scheme: రైతుల అకౌంట్‌లోకి రూ.2,000, రేపే పీఎం కిసాన్ స్కీమ్ ప్రారంభం
PM-Kisan Scheme: రైతుల అకౌంట్‌లోకి రూ.2,000, రేపే పీఎం కిసాన్ స్కీమ్ ప్రారంభం
  • Share this:
దేశవ్యాప్తంగా రైతులకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-KISAN) పథకాన్ని ఆదివారం (ఫిబ్రవరి 24) అధికారికంగా ప్రారంభించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 మూడు వాయిదాల్లో చెల్లిస్తామని బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... ఒక్కో రైతు అకౌంట్‌లోకి రూ.2,000 చొప్పున మొదటి విడత నగదు బదిలీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్వహించే రైతుల ర్యాలీలో కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో లక్షలాది మందికి నగదు బదిలీ చేయనున్నారు మోదీ.

Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

2018 డిసెంబర్ నుంచే రైతులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇవ్వాల్సిన వాయిదా రూ.2,000 రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అధికారులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలను పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మొదటి వాయిదా పొందేందుకు రైతులు ఆధార్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత వాయిదాలు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అని గతంలోనే ప్రకటించింది ప్రభుత్వం.

Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


ఇవి కూడా చదవండి:

Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లుWhatsApp Bug: మీ వాట్సప్‌లో బగ్ ఉందా? మీ ప్రైవసీకి ముప్పేనా?

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
First published: February 23, 2019, 8:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading