ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్- PM Kisan ఏడో ఇన్స్టాల్మెంట్ విడుదలైంది. కోట్లాది మంది రైతులకు అకౌంట్లో రూ.2,000 చొప్పున జమ అవుతున్నాయి. అయితే కొందరు రైతులకు మాత్రం రూ.2000 జమ కాలేదు. వారి అకౌంట్లలోకి పేమెంట్ ఫెయిల్ అయింది. అసలు కారణం ఏంటా అని ఆరా తీస్తే రైతుల వైపు నుంచి కొన్ని తప్పులు ఉన్నట్టు తేలింది. ఆధార్ నెంబర్ సరిగ్గా లేకపోవడం ఒక కారణం అయితే అకౌంట్ నెంబర్ తప్పుగా ఉండటం మరో కారణం. దీంతో పాటు రైతులు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్లు ఒకేలా లేకపోవడం. అంటే పేర్లలో చిన్నచిన్న మార్పులు ఉండటం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండటం లాంటివి. ఈ కారణాల వల్ల లక్షలాది మంది రైతులకు అకౌంట్లలో డబ్బులు జమ కావట్లేదు. అయితే రైతులు తాము సమర్పించిన వివరాలను అప్డేట్ చేసే అవకాశం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ లో రైతులు తమ వివరాలను సరిచేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ముందుగా https://pmkisan.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
అందులో Farmers Corner సెక్షన్లో Edit Aadhaar Failure Records పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhar Number, Account Number, Mobile Number, Farmer Name అని ఉంటాయి.
మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సరైన వివరాలు ఎంటర్ చేసి ఇమేజ్ టెక్స్ట్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత రైతు పేరు, తండ్రి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, సబ్ డిస్ట్రిక్ట్ పేరు, బ్లాక్ పేరు, ఊరి పేరు లాంటివి ఉంటాయి.
ఈ వివరాల్లో ఏదైనా తప్పు ఉండే Edit పైన క్లిక్ చేయాలి.
ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సేవ్ చేయాలి.
వెరిఫికేషన్‌లో మీ వివరాలన్నీ మ్యాచ్ అయితే మీకు పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020 డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా రూ.18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 9 కోట్ల మంది రైతులకు రూ.2,000 చొప్పున జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. మీరు పీఎం కిసాన్ లబ్ధిదారులైతే, మీకు ఇంకా రూ.2,000 జమ కాకపోతే మీ వివరాలను పైన చెప్పినట్టుగా అప్డేట్ చేయండి.
తప్పులు సరిదిద్దుకోవడంలో సమస్యలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి. లేదా పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్: 011-24300606, 155261, 0120-6025109, పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266, పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011—23381092, 23382401 నెంబర్లను సంప్రదించాలి. pmkisan- ict@gov.in మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.