హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan Refund: వాళ్లంతా పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి... ప్రాసెస్ ఇదే

PM Kisan Refund: వాళ్లంతా పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి... ప్రాసెస్ ఇదే

PM Kisan Refund: వాళ్లంతా పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి... ప్రాసెస్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

PM Kisan Refund: వాళ్లంతా పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి... ప్రాసెస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

PM Kisan Refund | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి (PM Kisan Scheme) చెందిన డబ్బులు కొందరు అనర్హులైన రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. అనర్హుల్ని గుర్తిస్తున్న ప్రభుత్వం వారి నుంచి డబ్బుల్ని వెనక్కి తీసుకుంటోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని (PM Kisan Scheme) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.6,000 పెట్టుబడి సాయాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకం ప్రారంభమైంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అనర్హులైన రైతుల అకౌంట్లలోకి కూడా డబ్బులు జమ (PM Kisan Installment) అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 21 లక్షల మంది అనర్హుల్ని గుర్తించింది యూపీ ప్రభుత్వం వారినుంచి డబ్బులు వెనక్కి తీసుకునే ప్రాసెస్ ప్రారంభించింది.

ఉత్తరప్రదేశ్‌లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో అనర్హులు లక్షల్లో ఉంటారని అంచనా. వారందర్నీ గుర్తించి డబ్బులు వెనక్కి తీసుకోవడం ఖాయం. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేవారు పీఎం కిసాన్ డబ్బులు పొందడానికి అర్హులు కాదు. ఇదొక్కటే కాదు. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి పీఎం కిసాన్ స్కీమ్ ప్రకటించినప్పుడే నియమనిబంధనల్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు కాదో వివరించింది. ఆ జాబితాలో ఉన్నవారెవరూ పీఎం కిసాన్ స్కీమ్‌కు అర్హులు కాదు. ఆ రూల్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Pension Scheme: త్వరలో ఈపీఎఫ్ఓ కొత్త పెన్షన్ స్కీమ్... కనీస పెన్షన్ రూ.3,000

ప్రభుత్వం అనర్హుల్ని గుర్తించడం కన్నా ముందు వాళ్లే తమ అకౌంట్లలో జమ అయిన డబ్బుల్ని వెనక్కి ఇచ్చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి. తమకు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా డబ్బులు పొందడానికి అర్హతలు లేకపోయినా, తమ అకౌంట్లలో డబ్బులు జమ అయినట్టైతే రీఫండ్ ద్వారా వెనక్కి ఇవ్వొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు... ప్రాసెస్ ఇదే

పీఎం కిసాన్ రీఫండ్ ప్రాసెస్ ఇదే

Step 1- ముందుగా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Online Refund పైన క్లిక్ చేయాలి.

Step 3- అందులో రెండో ఆప్షన్ ఎంచుకోవాలి.

Step 4- ఆ తర్వాత ఆధార్ నెంబర్ , అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్‌లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 5- ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసిన నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6- ఇమేజ్ కోడ్ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.

Step 7- మీకు స్క్రీన్ పైన మీ అకౌంట్‌లో జమ అయిన పీఎం కిసాన్ స్కీమ్ డబ్బుల వివరాలు కనిపిస్తాయి.

Step 8- రీఫండ్ పేమెంట్ పైన క్లిక్ చేసి, ఇమెయిల్ ఐడీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.

Step 9- ఆ తర్వాతి పేజీలో అన్ని వివరాలు కనిపిస్తాయి.

Step 10- ఆ వివరాలు చెక్ చేసి కన్ఫామ్ చేయాలి.

Step 11- ఆ తర్వాత పేమెంట్ పేజీ వస్తుంది.

Step 12- పేమెంట్ పేజీలో బ్యాంక్ సెలెక్ట్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇలా పీఎం కిసాన్ డబ్బుల్ని రీఫండ్ చేయాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Income tax, ITR Filing, Personal Finance, PM Kisan Scheme, Pradhan Mantri Kisan Samman Nidhi

ఉత్తమ కథలు