PM KISAN SCHEME GOOD NEWS FOR FARMERS MODI GOVERNMENT MAY INCREASE FINANCIAL ASSISTANCE FROM RS 6000 TO RS 10000 UNDER PM KISAN SCHEME KNOW HOW TO APPLY SS
PM Kisan Scheme: రైతులకు శుభవార్త... పీఎం కిసాన్ సాయం పెంచే ఆలోచనలో మోదీ ప్రభుత్వం
PM Kisan Scheme: రైతులకు శుభవార్త... పీఎం కిసాన్ సాయం పెంచే ఆలోచనలో మోదీ ప్రభుత్వం
(ప్రతీకాత్మక చిత్రం)
PM Kisan Scheme | పీఎం కిసాన్ లబ్ధిదారులకు త్వరలో మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశాలున్నాయి. ఈ పథకం కింద అందించే సాయం పెరిగే అవకాశం ఉంది.
రైతులకు శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం-PM Kisan ద్వారా అందించే సాయాన్ని పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం పీఎం కిసాన్ ద్వారా రైతులకు రూ.6000 సాయాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బును జమ చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో మోదీ ప్రభుత్వం రైతులపై వరాలు కురిపించబోతోందన్న వార్తలొస్తున్నాయి. అందులో పీఎం కిసాన్ సాయాన్ని పెంచడం ఒక ప్రతిపాదన. ప్రస్తుతం ఏటా అందిస్తున్న రూ.6000 సాయాన్ని రూ.10,000 చేసే ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉందని ఆ వార్తల సారాంశం. అదే జరిగితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు లాభపడనున్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2018లో ప్రారంభమైంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతీ ఏటా రూ.6000 అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైతులు పీఎం కిసాన్ కింద సాయం పొందాలంటే అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి భూమి పత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నెంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. రైతులు ఇంట్లో నుంచే సులువుగా పీఎం కిసాన్ స్కీమ్‌కు దరఖాస్తు చేయొచ్చు. పీఎం కిసాన్ పథకానికి అప్లై చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
PM Kisan Scheme: పీఎం కిసాన్ పథకానికి అప్లై చేయండి ఇలా
ముందుగా https://pmkisan.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి
Farmers corner సెక్షన్లో New Farmer Registration పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, ఇమేజ్ టెక్స్ట్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత వివరాలన్నీ ఎంటర్ చేసి దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
ఆ రిఫరెన్స్ నెంబర్‌తో అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు.
పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేయడంలో ఏవైనా సమస్యలు వస్తే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. 155261 లేదా 1800115526 లేదా 011-23381092 నెంబర్లకు రైతులు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.