Home /News /business /

PM KISAN SCHEME FARMERS MUST COMPLETE EKYC PROCESS BEFORE 2022 JULY 31 TO GET 12TH INSTALLMENT SS

PM Kisan Scheme: పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నారా? ఈ అవకాశం 30 రోజులు మాత్రమే

PM Kisan Scheme: పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నారా? ఈ అవకాశం 30 రోజులు మాత్రమే
(ప్రతీకాత్మక చిత్రం)

PM Kisan Scheme: పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నారా? ఈ అవకాశం 30 రోజులు మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)

PM Kisan Scheme | పీఎం కిసాన్ స్కీమ్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ జూలై తర్వాత విడుదల కానుంది. 12వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 12th Installment) పొందాలంటే రైతులు 30 రోజుల్లో ఇకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan) 12వ ఇన్‌స్టాల్‌మెంట్ జూలై తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. మే 31న 11వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇకేవైసీ పూర్తి చేసిన రైతుల అకౌంట్లలో మాత్రమే రూ.2,000 చొప్పున జమ అయ్యాయి. 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. పీఎం కిసాన్ స్కీమ్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 12th Installment) పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఇకేవైసీ పూర్తి చేయాల్సిందే. గతంలో కొంతకాలం పాటు ఆన్‌లైన్‌లో ఇకేవైసీ ప్రాసెస్ నిలిచిపోయింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఇకేవైసీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి రైతులు ఆన్‌లైన్‌లోనే ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.

రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి 2022 జూలై 31 వరకు అవకాశం ఉంది. అంటే మరో 30 రోజుల గడువు ఉంది. అప్పట్లోగా రైతులు ఇకేవైసీ పూర్తి చేస్తే 12వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2,000 పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో 2022 మే 31 వరకు ఉన్న గడువును 2022 జూలై 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మరోసారి గడువు పొడిగిస్తారా లేదా అన్న స్పష్టత లేదు. కాబట్టి ఇప్పటివరకు ఇకేవైసీ పూర్తి చేయని రైతులు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆన్‌లైన్‌లో ఇకేవైసీ ఎలా పూర్తి చేయాలో తెలుసుకోండి.

New Rules: మీ డబ్బుకు సంబంధించి నేటి నుంచి అమలులోకి వచ్చే 8 కొత్త రూల్స్

పీఎం కిసాన్ ఇకేవైసీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే


Step 1- రైతులు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

Step 4- ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 5- ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 6- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.

Step 7- ఇ-కేవైసీ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.

LIC Policy: రోజూ రూ.29 జమ చేయండి చాలు... రూ.4 లక్షలు మీ సొంతం... మహిళలకు మాత్రమే



ఇక పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా పెట్టుబడి సాయం పొందాలంటే రైతులు తమ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అర్హులైన రైతులను గుర్తించడం, మోసాలు జరగకుండా చూడటం కోసం రేషన్ కార్డ్ వివరాలు తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ పథకాన్ని 2019 లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2018 డిసెంబర్ నుంచి పీఎం కిసాన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: PM KISAN, Pmkisan samman nidhi, Pradhan Mantri Kisan Samman Nidhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు