హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan Scheme: పీఎం కిసాన్ రూ.2 వేలు పొందే రైతులకు అలర్ట్.. ఈ సర్వీసులకు చార్జీలు!

PM Kisan Scheme: పీఎం కిసాన్ రూ.2 వేలు పొందే రైతులకు అలర్ట్.. ఈ సర్వీసులకు చార్జీలు!

 PM Kisan Scheme: పీఎం కిసాన్ రూ.2 వేలు పొందే రైతులకు అలర్ట్.. ఈ సర్వీసులకు చార్జీలు!

PM Kisan Scheme: పీఎం కిసాన్ రూ.2 వేలు పొందే రైతులకు అలర్ట్.. ఈ సర్వీసులకు చార్జీలు!

PM Kisan Yojana | రైతులకు అలర్ట్. ఇంకా పీఎం కిసాన్ ఇకేవైసీ పూర్తి చేసుకోని వారు ఉంటే.. వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా ఈ పని పూర్తి చేయొచ్చు. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Farmers | రైతులకు అలర్ట్. మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులు పొందుతున్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇకేవైసీ (eKYC) పూర్తి చేసుకోవాలి. ఇలా ఇకేవైసీ పూర్తి చేసుకున్న వారికే డబ్బులు లభిస్తాయి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇకేవైసీ పూర్తి చేసుకోవాలని భావించే రైతులకు (Farmers) రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనే నేరుగా మీరే ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇకేవైసీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మీరే ఇకేవైసీ చేసుకుంటే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. సులభంగానే ఈ పని పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

లేదంటే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇకేవైసీ చేసుకోవచ్చు. డీబీటీ అగ్రికల్చర్ బీహార్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందే రైతులు అందరూ ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే స్కీమ్ ప్రయోజనాలు పొందలేరు. ఇలా కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఇకేవైసీ పూర్తి చేసుకోవాలని భావిస్తే.. చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

కేవలం రూ.35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్!

బయోమెట్రిక్ విధానంలో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఇకేవైసీ పూర్తి చేసుకుంటే రూ. 15 చార్జీ చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ చార్జీలను నిర్ణయించింది. లేదంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా ఓటీపీ విధానంలో ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి చార్జీలు ఉండవు.

పడిపోయిన డిమాండ్.. భారీగా పతనమైన బంగారం, వెండి దిగుమతులు!

పీఎం కిసాన్ ఇకేవైసీ ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం. ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ పీఎం కిసాన్ ఇకేవైసీ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్ , క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత సెర్చ్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందని గుర్తించాలి. తర్వాత సబ్‌మిట్ అథంటికేషన్‌పై క్లిక్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ వివరాలు కరెక్ట్‌గా ఉంటే.. మీ ఇకేవైసీ పూర్తి అవుతుంది.

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారులకు రూ. 2 వేలు చొప్పున అందిస్తూ వస్తోంది. కాగా రైతులు ఇంకా ఈ స్కీమ్‌లో చేరకపోతే.. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా చేరొచ్చు. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, పొలం పట్టా వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయని గుర్తించుకోవాలి.

First published:

Tags: Farmers, PM KISAN, PM Kisan Scheme

ఉత్తమ కథలు