హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan: ఎన్నికల ముందు రైతులకు బహుపతి.. పీఎం కిసాన్ డబ్బులు రెట్టింపు.. ఇక నుంచి రూ.12 వేలు..?

PM Kisan: ఎన్నికల ముందు రైతులకు బహుపతి.. పీఎం కిసాన్ డబ్బులు రెట్టింపు.. ఇక నుంచి రూ.12 వేలు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PM Kisan: వివాదాస్ప‌ద నూత‌న సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురు నేత‌లు ఆ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కంగ్రాట్స్ తెలిపారు.

ఇంకా చదవండి ...

వివాదాస్ప‌ద నూత‌న సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇవాళ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురు నేత‌లు ఆ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కంగ్రాట్స్ తెలిపారు. రైతుల ఆందోళ‌న‌లు ఫ‌లించిన‌ట్లు ఆయ‌న అన్నారు. ఈ నిర్ణయం మొందే కేంద్రం తీసుకొని ఉంటే.. 700 మంది రైతులు తమ ప్రాణాలను పోయేవి కాదు కదా అన్నారు. కేవలం రైతుల ఆందోళన వల్ల ప్రభుత్వం చట్టాలను వెన్నక్కి తీసుకోవడం దేశంలో మొదటి సారి అంటూ కేజ్రీవాల్ అన్నారు. ఇదిలా ఉండగా.. రైతులకు ప్రతీ ఏటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) ద్వారా రూ.6 వేలు మూడు విడతలుగా (నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేలు చొప్పున) పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

Explained: వరి కొనుగోలుపై కేంద్రం, రాష్ట్రం దోబూచులాట.. అసలు బాధ్యులెవరు..? కారణాలు ఇవేనా..


అయితే ఈ డబ్బులను రెట్టింపు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చిన డబ్బు కూడా రెట్టింపు అవుతుందనేది వార్తలు వస్తున్నాయి. ఇది జరిగితే, రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రూ.6000 బదులు రూ.12000 లభిస్తుంది. రాష్ట్రాలలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతులకు కానుక ఇచ్చే యేచనలో ఉన్నట్లు సమాచారం.

Farm Laws: సాగుచట్టాలను రద్దు చేసిన కేంద్రం.. అసలా చట్టాల్లో ఏముంది? రైతుల ఎందుకు వ్యతిరేకించారు?

మీడియా నివేదికల ప్రకారం.. బీహార్ వ్యవసాయ మంత్రి అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఇటీవల ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిశారు. ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద వచ్చిన మొత్తాన్ని రెట్టింపు చేయడం గురించి చర్చించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా విపరీతమైన నిరసనలు చేసింది పంజాబ్ రైతులే. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ప్రకటనలు చేసినట్లు తెలుస్తోంది.

Narendra Modi: ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు

ఇక మోడీ ప్రసంగంలో.. చిన్న రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని.. దానిపై వివాదాలు కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక పీఎం కిసాన్ కు సంబంధించి రూ.6 వేలను కూడా రూ.12 వేలు చేస్తారనేది వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రకటన ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలకు వెల్లడించాయి.

First published:

Tags: PM KISAN, PM Kisan Scheme, Pm modi

ఉత్తమ కథలు