హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan 11th Installment: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్... అప్పట్లోగా ఈ పని పూర్తి చేయండి

PM Kisan 11th Installment: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్... అప్పట్లోగా ఈ పని పూర్తి చేయండి

PM Kisan 11th Installment | మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నారా? ఏప్రిల్ నుంచి జూలై మధ్య వచ్చే పీఎం కిసాన్ (PM KIsan) 11వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రాకముందే ఈ పని పూర్తి చేయండి.

PM Kisan 11th Installment | మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నారా? ఏప్రిల్ నుంచి జూలై మధ్య వచ్చే పీఎం కిసాన్ (PM KIsan) 11వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రాకముందే ఈ పని పూర్తి చేయండి.

PM Kisan 11th Installment | మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నారా? ఏప్రిల్ నుంచి జూలై మధ్య వచ్చే పీఎం కిసాన్ (PM KIsan) 11వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రాకముందే ఈ పని పూర్తి చేయండి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో (PM Kisan Scheme) ఉన్న రైతులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వం త్వరలో 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan Installment) విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 సాయాన్ని అందిస్తుంది. ప్రతీ ఏటా ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి వాయిదా, ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య రెండో వాయిదా, డిసెంబర్ నుంచి మార్చి మధ్య మూడో వాయిదా చెల్లిస్తోంది. ఏప్రిల్ వచ్చేసింది కాబట్టి జూలైలోగా ఈ ఏడాదికి సంబంధించిన మొదటి వాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే ఎప్పట్లాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ పొందాలంటే రైతులు అంతకన్నా ముందు చేయాల్సిన పనులు ఉన్నాయి.

పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నరైతులు తమ వివరాలన్నీ అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఇటీవల ఇ-కేవైసీ కూడా తప్పనిసరి చేసింది ప్రభుత్వం. రైతులు ఇ-కేవైసీ చేయించకపోతే వారికి పీఎం కిసాన్ స్కీమ్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చే అవకాశం లేదు. అందుకే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ ద్వారా తమ వివరాలన్నీ అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది.

PM Kisan: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్... ఆ సర్వీస్ తాత్కాలికంగా నిలిపివేత

రైతులు ఇ-కేవైసీ ఎలా చేయాలి?

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లో ఇ-కేవైసీ చేసే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇ-కేవైసీ సర్వీస్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఓటీపీ ఆథెంటికేషన్‌తో ఆధార్ బేస్డ్ ఇ-కేవైసీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది.

పీఎం కిసాన్ రైతులందరూ తప్పనిసరిగా ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది. ఆఫ్‌లైన్‌లో ఇ-కేవైసీ పూర్తి చేయాలంటే పీఎం కిసాన్ రైతులు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇ-కేవైసీ అప్‌డేట్ చేసే అవకాశం లేదు కాబట్టి రైతులు కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లడం తప్పనిసరి. 2022 మే 31 లోగా రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ చేయించాలి. ఒకవేళ పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇ-కేవైసీ పునరుద్ధరిస్తే రైతులు ఆన్‌లైన్‌లోనే ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు ఆధార్ బేస్డ్ ఇ-కేవైసీ చేయించాలంటే ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేయాలి.

SBI Scheme: ఈ ఎస్‌బీఐ స్కీమ్‌లో చేరితే రెగ్యులర్‌గా రూ.10,000 ఆదాయం

ఆన్‌లైన్ ఇ-కేవైసీ ప్రాసెస్ ఇదే...

రైతులు ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

మీ ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.

ఇ-కేవైసీ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.

ఆ తర్వాత ఇక బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం రైతులు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి.

పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2018లో ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. త్వరలో 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ కానుంది.

First published:

Tags: Farmer, PM KISAN, PM Kisan Scheme, Pradhan Mantri Kisan Samman Nidhi

ఉత్తమ కథలు