పీఎం కిసాన్ (PM Kisan) యోజన లబ్ధిదారులు ఏటా కేంద్రం (Central Government) నుంచి రూ.6 వేలు అందుకుంటున్నారు. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 12వ విడత డబ్బులు త్వరలోనే విడుదల కానున్నాయి. వచ్చే నెలలో సెప్టెంబర్ నాటికి పన్నెండో విడత (12th instalment) డబ్బు రైతన్నల ఖాతాలలో జమ అవుతుందని సమాచారం. ఈ మనీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే లబ్ధిదారులు పీఎం కిసాన్ ఈకేవైసీ ప్రక్రియ (PM Kisan eKYC)ను పూర్తి చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి గడువు ఇప్పటికే తీరిపోయింది. అయితే కేంద్రం రైతులకు మరొక అవకాశం కల్పిస్తూ ఈకేవైసీ గడువు తేదీని ఆగస్టు 31కి పొడిగించింది.
అంటే ఇంకా కేవలం ఐదు రోజుల సమయమే మిగిలి ఉంది కాబట్టి ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు త్వరపడటం మంచిది. లేదంటే పీఎం కిసాన్ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రావడం వల్ల నిధులు అందుకోవడం కష్టం అవుతుంది. మరి ఈ eKYC ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* పీఎం కిసాన్ eKYC చివరి తేదీ
మునుపటి గడువు తేదీ జులై 31 పూర్తయినా, కొందరు రైతులు ఇంకా eKYC ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు eKYCని పూర్తి చేయడానికి ప్రభుత్వం చివరి తేదీని పొడిగించింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం, పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ eKYC గడువు 31 ఆగస్టు 2022 వరకు పొడిగించడం జరిగింది. PMkisan.gov.in వెబ్‌సైట్ ద్వారా పీఎం కిసాన్ eKYC ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు.
* eKYC ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయండిలా
స్టెప్ 1: ముందు https://pmkisan.gov.in/ వెబ్‌పేజీకి వెళ్లాలి.
స్టెప్ 2: హోమ్‌పేజీకి కుడి వైపు కనిపించే eKYC ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: eKYC పేజీ ఓపెన్ అయ్యాక.. మీ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి, సెర్చ్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: ఆధార్ కార్డ్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 5: అవసరమైన సమాచారం అందించాక, ‘Get OTP’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఈ OTPని ఎంటర్ చేస్తే మీ eKYC ప్రక్రియ పూర్తవుతుంది.
జులై 31లోపు eKYC ప్రక్రియను పూర్తి చేయకుంటే, పీఎం కిసాన్ తదుపరి విడతను అందుకునేందుకు అనర్హులవుతారు.
* eKYC ప్రక్రియను ఆఫ్‌లైన్‌లో ఎలా పూర్తి చేయాలి?
పీఎం కిసాన్ eKYC ప్రక్రియను బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు. రైతులు తమకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) వద్దకు వెళ్లి వారి ఇతర వివరాలు, బయోమెట్రిక్ వివరాలను అందించి ఇది పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఇచ్చినా వివరాలు తప్పయితే.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బాధ్యత వహించడంతో పాటు జరిమానా కట్టాల్సి రావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, PM KISAN, Pm kisan application, PM Kisan Maan Dhan Yojana, PM Kisan Scheme